Investment Fraud: ఆర్ఆర్ఆర్, అల వైకుంఠపురం సినిమా పేర్లతో మోసం.. హైదరాబాద్‌లో రూ.6 కోట్ల టోకరా

ఆర్ఆర్ఆర్, అల వైకుంఠపురం, లవ్ స్టోరీ వంటి సినిమాల్లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించిందో ముఠా. బాధితుల నుంచి మొత్తం రూ.6 కోట్ల వసూళ్లకు పాల్పడింది.

Investment Fraud: ఆర్ఆర్ఆర్, అల వైకుంఠపురం సినిమా పేర్లతో మోసం.. హైదరాబాద్‌లో రూ.6 కోట్ల టోకరా

Investment Fraud: హైదరాబాద్ నగరంలో పెట్టుబడి పేరుతో రూ.6 కోట్ల మోసానికి పాల్పడ్డ ఘటన వెలుగు చూసింది. సినిమాల్లో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించి మోసానికి పాల్పడిందో ముఠా. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, వారి బంధువులే లక్ష్యంగా ఈ మోసానికి పాల్పడ్డారు.

Parathas: పరాటాలపై 18 శాతం జీఎస్టీ.. బ్రిటీష్ వాళ్లు కూడా పన్ను వేయలేదన్న కేజ్రీవాల్

ఈ అంశంపై బాధితులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కూకట్ పల్లికి చెందిన కొంగర అంజమ్మ చౌదరి, నాగం ఉమా శంకర్ ఈ మోసానికి పాల్పడ్డారని బాధితులు పోలీసులకు తెలిపారు. ఫిల్మ్ ఇండస్ట్రీ డిస్ట్రిబ్యూషన్, రియల్ ఎస్టేట్, బోర్‌వెల్స్ రంగాలలో పెట్టుబడుల పేరుతో నిందితులు మోసం చేశారు. ఆర్ఆర్ఆర్, అల వైకుంఠపురం, లవ్ స్టోరీ, నిశ్శబ్దం, వెంకీ మామ, రాక్షసుడు, నాంది వంటి చిత్రాలలో పెట్టుబడులు పెడతామని నిందితులు నమ్మించారు. ఈ సినిమాల్లో పెట్టుబడుల ద్వారా అధిక లాభాలు పొందవచ్చని చెప్పారు. ఇలా 30 మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, వారి బంధువుల నుంచి దాదాపు రూ.6 కోట్ల వరకు వసూలు చేశారు.

Munugodu: ముగిసిన మునుగోడు ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం.. 100కు పైగా అభ్యర్థులు.. ప్రధాన పార్టీల అభ్యర్థులు వీళ్లే

తీరా ఎలాంటి పెట్టుబడులు ఉన్నట్లు కనిపించకపోవడంతో బాధితులు తమ డబ్బు తిరిగి ఇవ్వాలి అని అడిగారు. అయితే, నిందితులు డబ్బు ఇవ్వకపోగా బెదిరింపులకు, దాడికి పాల్పడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు చెప్పి, వారి అనుచరులతో బెదిరించినట్లు బాధితులు చెప్పారు. తమ దగ్గర డబ్బులు దండుకుని, మోసానికి పాల్పడ్డ నిందితులపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. బాధితులు హైదరాబాద్, సీపీఎస్ ఎదుట ఆందోళన చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు ఇద్దరినీ అరెస్టు చేశారు.