Gadwal Nude Calls : గద్వాల న్యూడ్ కాల్స్ కేసు.. ఇద్దరి అరెస్ట్, మరొకడి కోసం పోలీసుల వేట

గద్వాలలో న్యూడ్ కాల్ ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్న ఆకతాయిల ఆగడాలను అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నట్లు గద్వాల సీఐ చంద్రశేఖర్ చెప్పారు. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిఖిల్ అనే మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Gadwal Nude Calls : గద్వాల న్యూడ్ కాల్స్ కేసు.. ఇద్దరి అరెస్ట్, మరొకడి కోసం పోలీసుల వేట

Gadwal Nude Calls : గద్వాలలో న్యూడ్ కాల్ ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్న ఆకతాయిల ఆగడాలను అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నట్లు గద్వాల సీఐ చంద్రశేఖర్ చెప్పారు. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిఖిల్ అనే మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ప్రేమ పేరుతో యువతులను ట్రాప్ చేసి డబ్బు కోసం అమ్మాయిలను వేధించేవారని.. ఈ ముగ్గురి మధ్య విభేదాలు రావడంతో ఒకరి తర్వాత ఒకరు ఫోటోలను వైరల్ చేశారని అన్నారు. న్యూడ్ ఫోటోల వ్యవహారంలో సంబంధం ఉన్నవారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు సీఐ చంద్రశేఖర్. న్యూడ్ కాల్ ఫొటోల ఘటనతో గద్వాల్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

కొంతకాలంగా కొందరు ప్రజాప్రతినిధులు అమ్మాయిలతో చనువు పెంచుకుని, వారి అసభ్యకర ఫోటోలను స్క్రీన్ షాట్స్ తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఆ ఫోటోలు బయటకు రావడంతో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఇద్దరిని అరెస్ట్ చేసింది. తప్పించుకున్న మరో నిందితుడు నిఖిల్ కోసం ప్రత్యేకంగా కొన్ని టీమ్ లను రంగంలోకి దించారు.

అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేస్తున్న వారిని ఉపేక్షించేది లేదని పోలీస్ శాఖ ప్రకటించింది. ఇందుకు సహకరించిన వారిని కూడా వదిలి పెట్టే ప్రసక్తే లేదని చెప్పింది. ఎంత మంది అమ్మాయిలను వీరు బ్లాక్ మెయిల్ చేశారు? అనే విషయంపై పూర్తి స్థాయి వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు.