Punjab Jail : జైల్లోనే గ్యాంగ్‌స్టర్స్ హత్య .. సెలబ్రేట్ చేసుకున్న ఖైదీలు..

పంజాబ్‌లోని తార్న్ తరన్ జిల్లాలోని గోయింద్వాల్ సాహిబ్ సెంట్రల్ జైల్లో ఇద్దరు ప్రత్యర్థి గ్యాంగ్ సభ్యుల హత్య తరువాత కొందరు ఖైదీలు వేడుక చేసుకున్న వీడియో బయటపడింది. ఈ వీడియో రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది.

Punjab Jail : జైల్లోనే గ్యాంగ్‌స్టర్స్ హత్య .. సెలబ్రేట్ చేసుకున్న ఖైదీలు..

Gangsters ‘celebrate’ killing in Punjab prison

Punjab Jail : పంజాబ్‌లోని తార్న్ తరన్ జిల్లాలోని గోయింద్వాల్ సాహిబ్ సెంట్రల్ జైల్లో ఇద్దరు ప్రత్యర్థి గ్యాంగ్ సభ్యుల హత్య తరువాత కొందరు ఖైదీలు వేడుక చేసుకున్న వీడియో గత ఆదివారం బయటపడింది. ఈ వీడియో రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణ ఘటనకు సంబంధించి ఏడుగురు పోలీసులకు సస్పెండ్ చేయటం జరిగింది. సస్పెండ్ అయినవారిలో జైలు సూపరింటెండెంట్ సహా ఇదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. చనిపోయిన మృతదేహాలను వేలితో చూపిస్తే ఖైదీలు సెలబ్రేట్ చేసుకున్నట్లుగా ఈ వీడియోలో ఉంది.

జైల్లో ఖైదీల మధ్య జరిగిన ఘర్షణలో గ్యాంగ్‌స్టర్ సిధూ మూసేవాలా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మన్‌దీప్ సింగ్, మన్మోహన్ సింగ్ అనే ఖైదీలు గతవారం జైల్లోనే హత్యకు గురయ్యారు. వారి మృతదేహాలను వేలితో చూపుతూ కొంతమంది ఖైదీలు సెలబ్రేట్ చేసుకున్న వీడియోలు పంజాబ్ లో వైరల్ గా మారాయి. దీనిపై ఆప్ ప్రభుత్వంపై విమర్శలు కూడా వచ్చాయి. గ్యాంగ్ స్టర్ల మృతదేహాలకు కొద్ది దూరంలో పోలీసులు కూడా నిలబడి ఉన్నట్టు వీడియోలో కనిపించడంతో తీవ్ర కలకలం రేగింది. పోలీసులు అక్కడ ఉండగానే ఈ ఘర్షణ జరిగినట్లుగా దాన్ని పోలీసులు అడ్డుకోలేదనే విమర్శలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించి మొత్తం ఏడుగురు గ్యాంగ్‌స్టర్లపై కేసులు నమోదయ్యాయి.

జగ్గు భగ్వాన్‌పూరియా, లారెన్స్ బిష్ణోయిల నేతృత్వంలోని రెండు గ్యాంగుల మధ్య తలెత్తిన ఘర్ణణలో ఈ హత్యలు జరిగినట్టు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలో ఆప్‌ నేతృత్వంలోని ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఆప్ ప్రభుత్వ పాలనలో శాంతిభద్రతలు కరవయ్యాయని ఆరోపణలు చేస్తున్నారు.ఈ ఘటన అనంతరం నిందితులను జైలు అధికారులు వేరువేరు జైళ్లకు తరలించారు.

ఈ ఘటనలో అరెస్టయిన ఐదుగురు అధికారుల్లో జైలు సూపరింటెండెంట్ ఇక్బాల్ సింగ్ బ్రార్, అదనపు జైలు సూపరింటెండెంట్ విజయ్ కుమార్, అసిస్టెంట్ జైలు సూపరింటెండెంట్ హరీష్ కుమార్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ జోగిందర్ సింగ్, ఏఎస్‌ఐ హర్‌చంద్ సింగ్ లు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరించాలని పంజాబ్ పోలీసులు ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆదేశించారని ఉన్నాయని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (హెడ్ క్వార్టర్స్) సుఖ్‌చైన్ సింగ్ గిల్ తెలిపారు.