OMG : మాదాపూర్ డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ లో మంటలు

  • Published By: madhu ,Published On : January 30, 2019 / 06:40 AM IST
OMG : మాదాపూర్ డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ లో మంటలు

హైదరాబాద్ : మాదాపూర్..ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భారీ శబ్ధంతో జనాలు పరుగులు…భారీగా వస్తున్న మంటలతో స్థానికంగా ఉన్న వారిలో భయం…మంటలు ఎక్కడ తమవైపు వస్తాయనే భయం…ఏమైందో తెలియదు..కానీ ఓ రెస్టారెంట్‌ నుండి మంటలు చెలరేగడంతో మాదాపూర్ కొంత టెన్షన్ వాతావారణం నెలకొంది. రెస్టారెంట్ కావడంతో సిలిండర్ పేలిందా ? లేక షార్ట్ సర్క్యూట్ జరిగిందా అనేది కొశ్చన్. 

నగరంలోని మాదాపూర్‌లో అయ్యప్ప సొసైటీలో డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ ఉంది. జనవరి 30వ తేదీ ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడుతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రెస్టారెంట్‌‌పైనున్న గడ్డి ఉండడం..మంటలు భారీగా అలుముకున్నాయి. గాలి కూడా భారీగా వీచడంతో మంటలు వ్యాపించాయి. పక్కనే వివిధ కంపెనీలు..ఇళ్లు ఉండడంతో ఒక్కసారిగా జనాల్లో భయం ఏర్పడింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. భారీగా ఎగిసిపడుతున్న మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో ప్రాణనష్టం లేకున్నా భారీగానే ఆస్తినష్టం సంభవించినట్లు తెలుస్తోంది. అయితే పేలుడుకు గల కారణం మాత్రం తెలియరాలేదు. పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపడుతున్నారు. సిలిండర్ పేలిందా అనే అనుమానాలు మాత్రం వ్యక్తమౌతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

కాప్రా, వనస్థలిపురం గ్యాస్ పేలుళ్ల విషాదాలు మరోసారి ఈ ఘటన గుర్తుకు తెచ్చినట్లైంది. తమింట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ భద్రమేనా ? అనే ప్రశ్నలు ప్రతొక్క గృహిణి మెదడులో మెదలుతున్నాయి. సిలిండర్ల వినియోగం…డై..బై…డే పెరిగిపోతూనే ఉంది. కట్టెలు, కరెంటు పొయ్యిలకు చెక్ పెట్టేసిన మహిళలు వంటింట్లో పర్మినెంట్‌గా సిలిండర్‌కు స్థానం ఇచ్చేశారు. ప్రతి ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌పైనే మహిళలు వంటలు చేస్తున్నారు. అయితే…పేలుతున్న సిలిండర్లతో గృహిణిలు తీవ్ర భయంలో పడిపోయారు. గ్యాస్‌ సిలిండర్‌ను పరిశీలించకుండా వాడితే ఎంత అనర్థముందో తెలుసుకోవాల్సిన అవసరముందని పలువురు సూచిస్తున్నారు. బాధితులను ఆదుకునేందుకు బీమా సౌకర్యం ఉన్నా ఏజెన్సీలు, అధికారులు అవగాహన కల్పించడం లేదనే విమర్శలు ఉన్నాయి. గ్యాస్‌పై పనిచేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.