జర్మనీలో కాల్పుల కలకలం.. ఎనిమిది మంది మృతి

జర్మనీలో కాల్పుల కలకలం చెలరేగింది. రెండు వేర్వేరు బార్లలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 8మంది మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. దుండగులు తుపాకీతో

  • Published By: veegamteam ,Published On : February 20, 2020 / 02:14 AM IST
జర్మనీలో కాల్పుల కలకలం.. ఎనిమిది మంది మృతి

జర్మనీలో కాల్పుల కలకలం చెలరేగింది. రెండు వేర్వేరు బార్లలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 8మంది మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. దుండగులు తుపాకీతో

జర్మనీలో కాల్పుల కలకలం చెలరేగింది. రెండు వేర్వేరు బార్లలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 8మంది మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ ఘటన జర్మనీలోని(germany) హనావు(hanau) పట్టణంలో జరిగింది. ఆగంతకులు రెండు బార్లను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు పాల్పడ్డాడు. ఫ్రాంక్ ఫర్ట్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న హనావు(hanau) పట్టణంలో లక్షమంది జనాభా ఉంటున్నారు.

హుక్కా బార్ల దగ్గరకు వచ్చిన తుపాకులు ధరించిన గుర్తు తెలియని వ్యక్తులు స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు కాల్పులు జరిపారు. రంగంలోకి దిగిన పోలీసులు కాల్పులు జరిపిన వారి కోసం వెతుకుతున్నారు. మొదటి కాల్పుల ఘటన నగరం మధ్యలో ఉన్న ఓ బార్ దగ్గర జరగగా, రెండోది కెస్సెల్‌ స్టాట్ దగ్గర జరిగింది. షిషా బార్ లో ముగ్గురు, అరేనా బార్ అండ్ కేఫ్ లో ఐదుగురు మృతి చెందారు.

కాల్పులు జరిగిన ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. మొదటి ప్రదేశంలో దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. ఆ తర్వాత దుండగులు రెండో ప్రదేశానికి వెళ్లి అక్కడా ఫైరింగ్ చేశారు. ఈ కాల్పులు ఎవరు జరిపారు? కారణం ఏంటి? అనేది తెలియాల్సి ఉంది. కాల్పులతో జర్మనీ వాసులు ఉలిక్కిపడ్డారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. ఇది ఉగ్రవాదుల పనా? అనే కోణంలోనూ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. కాగా, ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా కాల్పులు జరిపింది మేమే అని ప్రకటించుకోలేదు.