Sextortion Racket : స్ట్రిప్‌చాట్ పేరుతో 200 మందిని రూ.22 కోట్లు మోసం చేసిన ముఠా గుట్టురట్టు

స్ట్రిప్‌చాట్ పేరుతో సోషల్ మీడియాలో యువకులను, వ్యాపారస్తులను, ప్రముఖులను, బ్లాక్ మెయిల్ చేస్తున్న ముఠాను ఘజియాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Sextortion Racket : స్ట్రిప్‌చాట్ పేరుతో 200 మందిని రూ.22 కోట్లు మోసం చేసిన ముఠా గుట్టురట్టు

sextortion racket

Sextortion Racket :  స్ట్రిప్‌చాట్ పేరుతో సోషల్ మీడియాలో యువకులను, వ్యాపారస్తులను, ప్రముఖులను, బ్లాక్ మెయిల్ చేస్తున్న ముఠాను ఘజియాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు గత రెండేళ్లలో 200 మందిని సెక్స్ టార్షన్ ద్వారా బ్లాక్ మెయిల్ చేసి రూ.22 కోట్లు వసూలు చేసినట్లు తెలుసుకున్నారు.

ఘజియా‌బాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…సెక్స్ టూరిజం నిర్వహిస్తున్న యోగేష్ గౌతమ్, అతని భార్య సప్నా‌ను పోలీసులు టూరిస్టులుగా సంప్రదించారు. మారు వేషంలో టూరిస్టులుగా వ్యవహరించి ఇద్దరు అమ్మాయిలను బుక్ చేసుకున్నారు. వారికోసం ఇద్దరు అమ్మాయిలను గోవా పంపించేందుకు ఆ దంపతులు ఏర్పాట్లు చేశారు.
Also Read : Man Raped Woman : మ్యాట్రిమోనీ సైట్ లో పరిచయం .. పెళ్లి పేరుతో లైంగిక దాడి
విమానాశ్రయంలో విటులుగా మారువేషంలో వచ్చిన  పోలీసులు గోవా వెళ్లే ఇద్దరు యువతులతో పాటు మరో యువతిని అరెస్ట్ చేశారు. సీఐఎస్ఎఫ్, ఎయిర్ పోర్టు పోలీసుల సాయంతో ఈ సెక్స్ రాకెట్ లో ప్రధాన సూత్రధారులైన భార్యాభర్తలను అరెస్ట్ చేశారు. వీరిని విచారించగా సెక్స్ టార్షన్ ద్వారా గడిచిన రెండేళ్లలో 200 మంది యువకులు, ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు, వాపారస్తులు, ప్రముఖులను బ్లాక్ మెయిల్ చేసి రూ. 22 కోట్లు వసూలు చేసినట్లు తెలుసుకున్నారు. 8 బ్యాంక్ ఎకౌంట్లు పోలీసులు సీజ్ చేశారు.

నిందితులపై ఐపీసీ సెక్షన్ న్ 292 (అశ్లీల పుస్తకాలు, వస్తువులు మొదలైనవి అమ్మకం మొదలైనవి), 384 (దోపిడీ), 406 (నేర ఉల్లంఘన),420 (మోసం) మరియు 120B (నేరపూరిత కుట్ర ) మరియు IT చట్టం యొక్క సంబంధిత నిబంధనలను కింద కేసు నమోదు చేశారు. వారిని మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

Also Read : Wife Extra Marital Affair : భార్య వివాహేతర సంబంధం…కల్పించుకోవద్దని వార్నింగ్…..