మరో ఘోరం : అనుమానంతో యువతి గొంతుకోసి దారుణ హత్య

ఉన్మాదులు రెచ్చిపోతూనే ఉన్నారు. ప్రేమ పేరుతో వెంటపడి.. చిన్న అనుమానానికే కక్ష పెంచుకుని కుత్తుక కోస్తున్నారు. అలాంటి ఓ ఉన్మాది చేతిలో ఓ యువతి దారుణ హత్యకు

  • Published By: veegamteam ,Published On : January 11, 2020 / 01:43 AM IST
మరో ఘోరం : అనుమానంతో యువతి గొంతుకోసి దారుణ హత్య

ఉన్మాదులు రెచ్చిపోతూనే ఉన్నారు. ప్రేమ పేరుతో వెంటపడి.. చిన్న అనుమానానికే కక్ష పెంచుకుని కుత్తుక కోస్తున్నారు. అలాంటి ఓ ఉన్మాది చేతిలో ఓ యువతి దారుణ హత్యకు

ఉన్మాదులు రెచ్చిపోతూనే ఉన్నారు. ప్రేమ పేరుతో వెంటపడి.. చిన్న అనుమానానికే కక్ష పెంచుకుని కుత్తుక కోస్తున్నారు. అలాంటి ఓ ఉన్మాది చేతిలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. హన్మకొండలో జరిగిన యువతి హత్య కలకలం రేపుతోంది. 

నిర్భయ లాంటి కఠిన చట్టాలు ఎన్ని తెచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఏ మాత్రం భయపడటం లేదు. ప్రేమ పేరుతో చుట్టూ తిరిగి.. చివరికి ఉన్మాదిలా మారి ప్రేమించిన వారి ప్రాణాలు తీస్తున్నారు. హన్మకొండ రామ్‌నగర్‌లో ఉన్మాది షాహీద్‌ రెచ్చిపోయాడు. యువతిని గొంతుకోసి చంపాడు. హన్మకొండ రాంనగర్‌కు చెందిన షాహిద్‌.. స్థానికంగా ఉన్న ఓ మటన్‌ షాప్‌లో పనిచేస్తున్నాడు. లష్కర్‌ సింగారానికి చెందిన ఎంబీఏ విద్యార్థిని హారతితో అతనికి పరిచయం ఉంది. ఈ క్రమంలోనే నిన్న(జనవరి 10,2020) రాంనగర్‌లోని షాహిద్ గదికి యువతి వెళ్లింది. అక్కడ వారిద్దరికి ఏదో విషయంలో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. మాటామాటా పెరగడంతో నిందితుడు హారతిపై దారుణంగా దాడి చేశాడు. ఆమె గొంతు కోసి అక్కడ నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన యువతి అక్కడికక్కడే చనిపోయింది. హత్య చేసిన తరువాత నిందితుడు జడ్జి ఎదుట లొంగిపోయాడు. పోలీసులకు సమాచారం అందించడంతో షాహిద్‌ను అరెస్ట్ చేశారు. 

కూతురు హత్యకు గురైందన్న విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి చేరుకొని బోరున విలపించారు. మధ్యాహ్నం 12 గంటలకు బయటకు వెళ్తున్నానని చెప్పి కానరాని లోకాలకు వెళ్లిపోయిందని కన్నీటి పర్యంతమయ్యారు. హత్య జరిగిన ఘటనా స్థలాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌, చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్‌ పరిశీలించి బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. యువతి కుటుంబానికి తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తామని ఎర్రబెల్లి హామీ ఇచ్చారు. 

shahid

కొంతకాలంగా షాహిద్‌కు హారతికి మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోందని పోలీసులు తెలిపారు. ప్రియురాలు హారతి తనను నిర్లక్ష్యం చేస్తోందనే అనుమానంతోనే అతడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. మరోవైపు క్లూస్‌ టీమ్‌ ఆధారాలు సేకరిస్తోంది. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి విచారణ చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. అదుపులోకి తీసుకున్న షాహిద్‌ నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని.. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు. యువతి హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చినట్లు కమిషనర్‌ తెలిపారు. 

* హన్మకొండ రామ్‌నగర్‌లో రెచ్చిపోయిన ఉన్మాది షాహిద్‌ 
* యువతిని గొంతుకోసి చంపిన ప్రేమోన్మాది
* స్థానికంగా మటన్‌ షాప్‌లో పనిచేస్తున్న షాహిద్
* లష్కర్‌సింగారానికి చెందిన ఎంబీఏ విద్యార్థిని హారతితో పరిచయం 
* ఇద్దరి మధ్య గొడవ.. హారతిని గొంతు కోసి చంపిన ఉన్మాది
* ఎంబీఏ విద్యార్థిని హారతితో పరిచయం 
* జడ్జి ఎదుట లొంగిపోయిన నిందితుడు 
* కొంతకాలంగా షాహిద్‌కు హారతికి మధ్య గొడవలు 
* హారతి నిర్లక్ష్యం చేస్తోందనే అనుమానంతోనే ఘాతుకం

Also Read : మిస్‌ మోడల్‌కు ప్రయత్నిస్తున్న యువతిపై అత్యాచారం : హైదరాబాద్ లో మరో దారుణం