బాలిక ఆత్మహత్య కేసు : వెలుగులోకి సంచలన నిజాలు

యాదాద్రి జిల్లాలో బాలిక ఆత్మహత్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. సంస్థాన్ నారాయణ్ పూర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

  • Published By: veegamteam ,Published On : August 31, 2019 / 10:17 AM IST
బాలిక ఆత్మహత్య కేసు : వెలుగులోకి సంచలన నిజాలు

యాదాద్రి జిల్లాలో బాలిక ఆత్మహత్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. సంస్థాన్ నారాయణ్ పూర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

యాదాద్రి జిల్లాలో బాలిక ఆత్మహత్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు గిరి వేధింపులు తాళలేక శుక్రవారం (ఆగస్టు 30, 2019)వ తేదీన సంస్థాన్ నారాయణ్ పూర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న భవాని అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో గిరిని రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రహస్య ప్రాంతంలో అతన్ని విచారిస్తున్నారు. విచారిస్తున్న క్రమంలో కీలక విషయాలు బయట పడ్డాయి. అమ్మాయిలను ట్రాప్ చేయడంలో గిరి ఎక్స్ పర్ట్ అని తెలుస్తోంది.

చౌటుప్పల్ ట్రినిటీ స్కూల్ లో గిరి పీఈటీగా పని చేస్తున్నాడు. రెండు నెలల క్రితం ఐదుగురు విద్యార్థినులను పిక్నిక్ కు తీసుకెళ్లాడు. తల్లిదండ్రులకు తెలియకుండా విద్యార్థినులతో ఐదు రోజులపాటు టూర్ కు వెళ్లాడు. ఆ 5 రోజులూ గిరి విద్యార్థినులతో కలిసి రాచకొండ గుట్టల్లో బస చేశాడు. యాజమాన్యం గిరిని మందలించడం, తల్లిదండ్రులు ఒత్తిడి చేయడంతో విద్యార్థినులను తీసుకొచ్చాడు.

కానీ ట్రినిటీ స్కూల్ యాజమాన్యం మాత్రం గిరిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బాలిక ఆత్మహత్య ఘటన విషయంలో కూడా ట్రినిటీ స్కూల్ యాజమాన్యం గిరికి సపోర్టుగా ఉన్నట్లు తెలుస్తోంది.