హోటల్లో లవ్ ఫైర్ : ప్రియురాలు చెప్పిన ఒకే మాట.. ప్రియుడు సూసైడ్!

ఆ ఇద్దరు ప్రేమించుకున్నారు. ప్రేమ కోసం పెద్దలను ఎదురించారు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ప్రియుడు కలలు కంటున్నాడు. ఇద్దరు బీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నారు.

  • Published By: sreehari ,Published On : September 20, 2019 / 08:36 AM IST
హోటల్లో లవ్ ఫైర్ : ప్రియురాలు చెప్పిన ఒకే మాట.. ప్రియుడు సూసైడ్!

ఆ ఇద్దరు ప్రేమించుకున్నారు. ప్రేమ కోసం పెద్దలను ఎదురించారు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ప్రియుడు కలలు కంటున్నాడు. ఇద్దరు బీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నారు.

ఆ ఇద్దరు ప్రేమించుకున్నారు. ప్రేమ కోసం పెద్దలను ఎదురించారు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ప్రియుడు కలలు కంటున్నాడు. ఇద్దరు బీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. ప్రియురాలు మాత్రం చదువే ప్రాణం అంటోంది. ముందు చదువు.. ఆ తర్వాతే పెళ్లి అంటోంది. లేదు.. లేదు.. అప్పటివరకు ఆగలేను.. వెంటనే పెళ్లి చేసుకుందాం అన్నాడు. మన కెరీర్ బాగుండాలంటే ఇద్దరం చదువుకోవాలి నేను చెప్పేది అర్థం చేసుకో అన్నది. అందుకు ప్రియుడు ససమేరా అన్నాడు. ప్రేమించిన ప్రియురాలు ఎక్కడ దూరం అవుతుందోనని భయపడ్డాడు.

కానీ, అమ్మాయి మాత్రం పెళ్లి విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలనుకుంది. పెద్దల నుంచి ఒత్తిడి నుంచి తట్టుకోలేని ప్రియుడు ప్రియురాలిని పెళ్లి చేసుకోవాలని తెగ తొందర పెడుతున్నాడు. ఒకరోజు ఇద్దరు కలిసి ఓ హోటల్ కు వెళ్లారు. కుదుటుగా ఆలోచించి ఒక నిర్ణయానికి వద్దమనుకున్నారు. కానీ, అక్కడ కూడా ఇదే పరిస్థితి. అమ్మాయి మాత్రం చదువు తప్ప మరొకటి ఆలోచన చేయడం లేదు. మాటామాటా పెరిగింది. ఇద్దరు గొడవపడ్డారు. ప్రియురాలు మనస్సు మారకపోవడంతో విసుగు చెందాడు. జీవితంపై విరక్తి పుట్టింది. ప్రేమించిన అమ్మాయి ఎక్కడ దూరం అవుతుందోనన్న భయమే అతడిలో ఎక్కువగా ఉంది. 

అదే.. అతడిని సూసైడ్ చేసుకునేలా ప్రేరేపించింది. తన మనస్సులోని బాధను ఎంత నచ్చచెప్పిన ప్రియురాలి వినడం లేదన్న మనో వేదన తీవ్రరూపం దాల్చింది. సైలెంట్ అయిపోయాడు. తర్వాత మాట్లాడదాంలే అని ప్రియురాలి వాషింగ్ రూంకు వెళ్లింది. ఇంతలో ప్రియుడు సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకున్నాడు. చివరికి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన రాజస్థాన్ లోని అంబర్ ఏరియా హోటల్లో జరిగింది. వాష్ రూం నుంచి బయటకు వచ్చేసరికి ఫ్యాన్ కు వేలాడుతున్న ప్రియుడిని చూసి ఆమె షాక్ అయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఏదోలా అతన్ని కిందికి దింపింది. తర్వాత హోటల్ సిబ్బందిని పిలిచింది. స్నేహితులకు సమాచారం అందించింది. స్నేహితులు అక్కడికి చేరుకున్నారు. 

హోటల్ సిబ్బంది సాయంతో అపస్మారక స్థితిలో ఉన్న యువకుడి వెంటనే ఆస్పత్రికి తరలించినట్టు ఎస్ హెచ్ఓ (అంబర్) రాజేంద్ర సింగ్ చరణ్ తెలిపారు. యువకుడి తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇచ్చామన్నారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ అతడి ప్రాణాలను కాపాడలేకపోయారు. చేతికి వచ్చిన కొడుకు ఇలా మృతిచెందడంతో అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడి ప్రియురాలిని పోలీసులు విచారించారు.

తమ మధ్య పెద్ద గొడవ జరగలేదని, పెళ్లి విషయంలో చర్చించుకున్నామని చెప్పింది. తాను చదువుకుందామని చెబితే అతడు పెళ్లి చేసుకుందామని తొందరపెట్టాడని, తాను నచ్చజెప్పేందుకు ప్రయత్నించినట్టు విచారణలో తెలిపింది. వాష్ రూంలోకి వెళ్లి వచ్చేసరికి ఫ్యాన్ కు ఉరేసుకుని ఉన్నాడని చెప్పింది. సూసైడ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు యువకుడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు.