Jharkhand : ఇంట్లోకి దూసుకెళ్లిన విమానం

ఝార్ఖండ్ (Jharkhand) లోని ధన్ బాద్(Dhanbad)నగరంలో విమాన ప్రమాదం జరిగింది. ఓ చిన్నపాటి విమానం(Glider Plane)అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పైలట్ సహా 14 ఏళ్ల బాలుడికి గాయాలయ్యాయి.

Jharkhand : ఝార్ఖండ్ (Jharkhand) లోని ధన్ బాద్(Dhanbad)నగరంలో విమాన ప్రమాదం జరిగింది. ఓ చిన్నపాటి విమానం(Glider Plane)అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పైలట్ సహా 14 ఏళ్ల బాలుడికి గాయాలయ్యాయి. ధన్ బాద్ లోని బర్వాడ్ద ఏర్ స్ట్రిప్ నుంచి తేలికపాటి విమానం బయల్దేరింది. టేక్ఆఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ పోర్టుకు 500 మీటర్ల దూరంలో ఉన్న ఓ ఇంటి పిల్లర్ ను విమానం ఢీకొట్టింది. దీంతో విమానం ముక్కలు ముక్కలైంది.

విమానంలోని ఫైలట్, బాలుడికి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిని ఇద్దరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కాగా, ఇంట్లో వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదని ఆ ఇంటి యజమాని నీలేశ్ కుమార్ తెలిపారు. ఇంట్లో ఆడుకుంటున్న తమ పిల్లలు ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డరని పేర్కొన్నారు.

Plane Crashed Power Lines : అమెరికాలో విమాన ప్రమాదం.. విద్యుత్‌ తీగలపై కుప్పకూలిన ఫ్లైట్

విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే పూర్తిస్థాయి విచారణ తర్వాతే విమానం కూలిపోవడానికి గల కారణాలు తెలుస్తాయని చెప్పారు. ఈ ఘటనలో గాయపడిన బాలుడు బీహార్ లోని పట్నాకు చెందినవాడని వెల్లడించారు. ధన్ బాద్ నగరంలోని తన బందువుల ఇంటికి వచ్చాడని పేర్కొన్నారు.

ధన్ బాద్ నగరంలోని ఆకాశంలో విహరిస్తూ చూడాలనుకున్నాడని చెప్పారు. దీంతో బాలుడు చిన్నపాటి విమానంలో ప్రయాణించాడు. ఆకాశంలో విహరిస్తుండగా ఒక్కసారిగా విమానం ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. కాగా, ధన్ బాద్ నగరం అందాలను ఆకాశం నుంచి చూడటానికి చిన్నపాటి విమానాలను ఓ ప్రైవేటు ఏజెన్సీ నడుపుతోంది. వాటిలో పైలట్ తో పాటు మరొకరికి మాత్రమే ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు