Shamshabad Airport Gold Smuggling : ఖతర్నాక్ స్కెచ్..! అయినా దొరికిపోయాడు.. లేడీస్ హ్యాండ్ బ్యాగ్‎లో దాచి బంగారం స్మగ్లింగ్

గోల్డ్ స్మగ్లర్లు తెలివి మీరుతున్నారు. కొత్త కొత్త పద్దతుల్లో బంగారం స్మగ్లింగ్ కు ప్లాన్ చేస్తున్నారు. కస్టమ్స్ అధికారులు ఎంత నిఘా పెట్టినా.. కేటుగాళ్లు మాత్రం స్మగ్లింగ్ ప్రయత్నాలు ఆపడం లేదు. అధికారులకు చిక్కకుండా ఉండేందుకు ఖతర్నాక్ స్కెచ్ లు వేస్తున్నారు. అయినా.. వారి ప్లాన్స్ ఫలించడం లేదు. అధికారుల నిఘా నుంచి తప్పించుకోలేకపోతున్నారు. అడ్డంగా దొరికిపోతున్నారు.

Shamshabad Airport Gold Smuggling : ఖతర్నాక్ స్కెచ్..! అయినా దొరికిపోయాడు.. లేడీస్ హ్యాండ్ బ్యాగ్‎లో దాచి బంగారం స్మగ్లింగ్

Shamshabad Airport Gold Smuggling : గోల్డ్ స్మగ్లర్లు తెలివి మీరుతున్నారు. కొత్త కొత్త పద్దతుల్లో బంగారం స్మగ్లింగ్ కు ప్లాన్ చేస్తున్నారు. కస్టమ్స్ అధికారులు ఎంత నిఘా పెట్టినా.. కేటుగాళ్లు మాత్రం స్మగ్లింగ్ ప్రయత్నాలు ఆపడం లేదు. అధికారులకు చిక్కకుండా ఉండేందుకు ఖతర్నాక్ స్కెచ్ లు వేస్తున్నారు. అయినా.. వారి ప్లాన్స్ ఫలించడం లేదు. అధికారుల నిఘా నుంచి తప్పించుకోలేకపోతున్నారు. అడ్డంగా దొరికిపోతున్నారు.

తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో మరోసారి అక్రమ బంగారం రవాణ వ్యవహారం వెలుగుచూసింది. అక్రమంగా తరలిస్తున్న 260 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. షార్జా నుంచి వచ్చిన ప్రయాణికుడు హ్యాండ్ బ్యాగ్ స్టీల్ హ్యాండ్ పుష్ విస్క్ లో బంగారాన్ని కడ్డీల రూపంలో దాచాడు. అతడిపై అనుమానం రావడంతో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. హ్యాండ్ బ్యాగ్ స్టీల్ హ్యాండ్ ను పగలగొట్టారు. అందులో దాచిన బంగారం బయటపడింది. గోల్డ్ ని అధికారులు సీజ్ చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గోల్డ్ ఎక్కడి నుంచి తెచ్చాడు? ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? అనే వివరాలు ఆరా తీస్తున్నారు.

నిందితుడు 260 గ్రాముల బంగారాన్ని ఐదు ముక్కలు చేశాడు. ఎవరూ గుర్తు పట్టకుండా లేడీస్ హ్యాండ్ బ్యాగ్ స్టీల్ హ్యాండ్ లో దాచాడు. రూ.13లక్షల 73వేల కస్టమ్స్ డ్యూటీని ఎగ్గొట్టేందుకు నిందితుడు వేసిన స్కెచ్ ఫెయిల్ అయ్యింది. లేడీస్ హ్యాండ్ బ్యాగ్ పురుషుడు దగ్గర ఉండటంతో అధికారులు డౌట్ వచ్చింది. అంతే, అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి దగ్గర ఉన్న హ్యాండ్ బ్యాగ్ ను ముక్కలు ముక్కలు చేశారు. అందులోంచి బంగారం బయటపడటంతో అధికారులు షాక్ అయ్యారు. అధికారులకు చిక్కకుండా గోల్డ్ స్మగ్లింగ్ కు నిందితుడు ఖతర్నాక్ స్కెచ్ వేసినా అడ్డంగా దొరికిపోయాడు.