మణిపూర్ అసెంబ్లీ బయట గ్రెనేడ్ దాడి

మణిపూర్ అసెంబ్లీ కాంప్లెక్స్ బయట ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు సిఆర్పీఎఫ్ సిబ్బందికి గాయాలు అయ్యాయని అధికారులు తెలిపారు.

  • Published By: veegamteam ,Published On : November 22, 2019 / 02:32 PM IST
మణిపూర్ అసెంబ్లీ బయట గ్రెనేడ్ దాడి

మణిపూర్ అసెంబ్లీ కాంప్లెక్స్ బయట ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు సిఆర్పీఎఫ్ సిబ్బందికి గాయాలు అయ్యాయని అధికారులు తెలిపారు.

మణిపూర్ అసెంబ్లీ కాంప్లెక్స్ బయట ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు సిఆర్పీఎఫ్ సిబ్బందికి గాయాలు అయ్యాయి. ఈ సంఘటన (శుక్రవారం నవంబర్ 22, 2019) చోటు చేసుకుంది. రాజధాని నగరంలోని థాంగ్‌మీబాండ్ ప్రాంతంలోని అసెంబ్లీ కాంప్లెక్స్ ముందు గేట్ బయట సాయంత్రం 5.15 గంటలకు సంఘటన జరిగిందని అధికారులు తెలిపారు. 

అసెంబ్లీ కాంప్లెక్స్ దగ్గర విధుల్లో ఉన్న 87 వ బెటాలియన్ ఫోర్స్ కు చెందిన ఇద్దరు సిఆర్పీఎఫ్ సిబ్బంది గ్రెనేడ్ పేలుడుతో గాయపడ్డారు. గాయపడిన సిఆర్పీఎఫ్ జవాన్లను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు వారికి వైద్యం అందిస్తున్నారు. గ్రెనేడ్ దాడి జరిగినప్పుడు పెద్ద శబ్ధం రావడంతో సమీపంలోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు.