కాసేపట్లో పెళ్లి..UPలో ఘోరం

10TV Telugu News

కాసేపట్లో పెళ్లి జరుగనుంది..కానీ అంతలోనే ఘోరం జరిగిపోయింది. ఎంతో సంతోషంగా సంబరాలు జరుపుకుంటున్నా ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పెళ్లి వాయిద్యాలు మ్రోగాల్సిన చోట..చావు డప్పులు వినిపించాయి. కాసేపట్లో వధువు మెడలో తాళి కట్టాల్సిన వరుడిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపేశారు. ఈ విషాద ఘటన యూపీ రాష్ట్రంలో చోటు చేసుకుంది. 
వివరాల్లోకి వెళితే…

సింగ్ పూర్ ప్రాంతంలో నివాసం ఉండే యువతికి ఓ వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. అందులో భాగంగా వరుడు, అతని కుటుంబసభ్యులు బారాత్ గా వధువు ఇంటికి బయలుదేరారు. పెళ్ళి కుమారుడి కుటుంబసభ్యులకు ఘనంగా స్వాగతం పలికింది వధువు  ఫ్యామిలీ. పెళ్లి కుమారుడు మండపానికి నడిచి వస్తున్నాడు. అంతనేలో బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు వరుడిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. అక్కడికక్కడనే కుప్పకూలిపోయాడు.

రక్తపు మడుగులో ఉన్న వరుడిని చూసి అందరూ షాక్ తిన్నారు. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను అనంతలోకాలకు వెళ్లిపోయాడని వైద్యులు నిర్ధారించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వరుడు, వధువు కుటుంబసభ్యుల్లోని కొంతమందిని పోలీసులు విచారించారు. ఘటన జరిగిన ప్రదేశంలో సీసీ కెమెరాలు లేవని, అయినా.. నిందితులను త్వరలోనే పట్టుకుంటామంటున్నారు పోలీసులు. అయితే..వరుడిపై ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది ? కాల్పులు జరిపింది ఎవరు ? తదితర వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కానుంది. 

Read More : రాజధాని..తేల్చేసిన కేంద్రం : టీడీపీ నెక్ట్స్ స్టెప్ ఏంటీ