Guatemala: గ్వాటెమాలా స్వాతంత్ర్య దినోత్సవం రోజు తొక్కిసలాట.. 9 మంది మృతి

గ్వాటెమాలాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. ఈ వేడుకల సందర్భంగా నిర్వహించిన ఒక కార్యక్రమానికి భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. దీంతో తొక్కిసలాట జరిగి 9 మంది మరణించారు.

Guatemala: గ్వాటెమాలా స్వాతంత్ర్య దినోత్సవం రోజు తొక్కిసలాట.. 9 మంది మృతి

Guatemala: గ్వాటెమాలా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. ఒక వేడుక సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 9 మంది మరణించారు. ఈ ఘటన గురువారం ఉదయం జరిగింది. సెప్టెంబర్ 15.. గ్వాటెమాలాకు స్వాతంత్ర్యం వచ్చిన రోజు. ఈ ఏడాది ఆ దేశం 201వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకొంటుంది.

First Flying Bike: మొదటి ఫ్లైయింగ్ బైక్.. ఎలా ఎగురుతుందో చూడండి.. మార్కెట్లోకి వస్తుందా?

ఈ సందర్భంగా అక్కడి క్వెజల్టనాంగో పట్టణంలో గురువారం వేకువఝామున ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు జనం భారీగా హాజరు కావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని స్థానిక మీడియా వెల్లడించింది. అలాగే మరో 20 మందికిపైగా గాయపడ్డారు. ఘటన సమాచారం అందుకున్న రెడ్ క్రాస్ సభ్యులు, సహాయక సిబ్బంది అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.