Constable Killed: ట్రక్కును ఆపేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్.. ఢీకొట్టి చంపిన డ్రైవర్

ట్రక్కును ఆపేందుకు ప్రయత్నించిన పోలీస్ కానిస్టేబుల్‌ను ఢీకొట్టి చంపాడు డ్రైవర్. అనంతరం కొంతదూరంలో ట్రక్కును వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Constable Killed: ట్రక్కును ఆపేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్.. ఢీకొట్టి చంపిన డ్రైవర్

Constable Killed (1)

Constable Killed: రహదారిపై తనిఖీల్లో భాగంగా ట్రక్కును ఆపేందుకు ప్రయత్నించిన పోలీస్ కానిస్టేబుల్‌ను ఢీకొట్టి చంపాడు డ్రైవర్. అనంతరం కొంతదూరంలో ట్రక్కును వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. ఈ ఘటన గుజరాత్‌లోని ఆనంద్ జిల్లా, బర్సాన్ పట్టణ పరిధిలోని హైవేపై మంగళవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక రహదారిపై కానిస్టేబుల్ అర్థరాత్రి తనిఖీలు నిర్వహిస్తున్నాడు.

Vacant Posts: కేంద్ర ఉద్యోగాల్లో 9.79 లక్షల ఖాళీలు: ప్రకటించిన కేంద్రం

ఈ క్రమంలో ట్రక్ కంటైనర్ ఒకటి అనుమానాస్పదంగా అనిపించింది. దీంతో ఆ ట్రక్కును ఆపేందుకు కిరణ్ రాజ్ అనే కానిస్టేబుల్ ప్రయత్నించాడు. అయితే, ట్రక్కు డ్రైవర్ ఆపకుండా, అతడ్ని ఢీకొట్టాడు. ఈ ఘటన అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో జరిగింది. ఈ ఘటనలో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడ్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించాడు. కానిస్టేబుల్‌ను ఢీకొట్టిన తర్వాత డ్రైవర్ ట్రక్కును కొంతదూరంలో వదిలేసి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ట్రక్కును రాజస్థాన్‌కు చెందినదిగా గుర్తించారు. పారిపోయిన డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Senior Citizens: సీనియర్ సిటిజన్లకు రైల్వే షాక్.. టిక్కెట్‌పై సబ్సిడీ పునరుద్ధరణకు నో

24 గంటల వ్యవధిలోనే దేశంలో పోలీసుల్ని హతమార్చిన ఘటనలు మూడు జరగడం గమనార్హం. మంగళవారం ఝార్ఖండ్‌లోని రాంచీలో వాహనాలు తనిఖీ చేస్తుండగా, ఒక మహిళా కానిస్టేబుల్‌ను వాహనం ఎక్కించి చంపారు. ఆ వాహనంలో పశువుల్ని అక్రమంగా తరలిస్తున్నారు. మరో ఘటనలో హరియాణాలో మైనింగ్ మాఫియాను అడ్డుకునేందుకు వెళ్లిన డీఎస్పీని ట్రక్కు ఎక్కించి చంపిన సంగతి తెలిసిందే.