ఉరిశిక్ష: 3ఏళ్ల చిన్నారిని Rape చేసిన వ్యక్తికి కోర్టు తీర్పు

ఉరిశిక్ష: 3ఏళ్ల చిన్నారిని Rape చేసిన వ్యక్తికి కోర్టు తీర్పు

గుజరాత్ లోని ఆనంద్ స్పెషల్ కోర్టు 3ఏళ్ల చిన్నారిని Rape చేసి హత్య చేసినందుకు మరణశిక్ష విధించింది. పొక్సో చట్టం కింద పరిగణించాల్సిన కేసులపై మంగళవారం కోర్టు విచారణ జరిపింది. అడిషనల్ సెషన్స్ జడ్జి దిలీప్ హింగూ సమక్షంలో విచారణ జరిపి రాజు దేవీపూజక్ (38)అనే వ్యక్తికి 2017 ఫిబ్రవరి 14న చేసిన ఘటనకు గానూ శిక్ష ఖరారు అయింది.

ఇలాంటి కేసులు చాలా అరుదైన విభాగం కిందకు వస్తాయని చెప్పింది. దాంతో పాటు అతను రెండేళ్ల జైలు శిక్ష తప్పించుకున్నందుకు గానూ రూ.5వేల జరిమానా కూడా విధించింది. కోర్టు అతనిపై పొక్సో చట్టం ఐపీసీ సెక్షన్స్ ప్రకారం.. యాక్షన్ తీసుకుంది.



ముద్దాయి బాలికను పొగాకు ఫాంకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత గొంతునులిమి చంపేశాడు. ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని దొంగిలించాడు.