శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికలు..ముస్లిం ఓటర్లపై ఫైరింగ్

  • Published By: venkaiahnaidu ,Published On : November 16, 2019 / 04:06 AM IST
శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికలు..ముస్లిం ఓటర్లపై ఫైరింగ్

శ్రీలంకలో ఇవాళ(నవంబర్-16,2019) అధ్యక్ష ఎన్నికలు జరగుతున్న విషయం తెలిసిందే. అయితే అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కు కొన్ని గంటలముందు  ఓ దుండగుడుమైనార్టీ ముస్లిం ఓటర్లను తీసుకువెళ్తున్న బస్సుల కాన్వామ్ పై కాల్పులు జరపడం కలకలం రేపుతోంది. అయితే ఈ ప్రమాదంలో ఎంతమంది గాయపడ్డారనేది ఇంకా తెలియరాలేదు. 

తమ ఓట్లు రిజిస్టర్ అయి ఉన్న పొరుగు జిల్లా మన్నార్ వెళ్లేందుకు పుట్టలమ్ నుంచి బయలుదేరిన ముస్లింల బస్సుల కాన్యాయ్ పై ఓ గన్ మెన్ కాల్పులు జరిపాడు. ఓ అధికారి తెలిపిన వివరాల ప్రకారం…దాడి చేసిన వారు రోడ్డుపై టైర్లను తగలబెట్టారని, 100 కి పైగా వాహనాల కాన్వాయ్‌ను ఆకస్మికంగా దాడి చేయడానికి తాత్కాలిక రోడ్ బ్లాక్‌లను ఏర్పాటు చేశారని తెలిపారు. ఇంతలో ఓ గన్ మెన్ ఫైరింగ్ ఫైరింగ్ ప్రారంభించాడని,రాళ్లు విసిరేశాడని తెలిపారు. కనీసం రెండు బస్సులు ఢీకొన్నాయన్నారు. కాని ప్రాణనష్టం జరిగినట్లు నివేదికలు అందలేదని రాజధాని కొలంబోకు 240కిలోమీటర్లు దూరంలోని తంత్రిమలెలోని పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. 

సమాచారం అందుకున్న పోలీసు బలగాలు స్పాట్ కు చేరుకుని..రహదారిపై ఉన్న అడ్డంకులను తొలగించి, ప్రయాణీకులు ఓటింగ్ లో పాల్గొనేందుకు వీలుగా కాన్వాయ్‌ను ఎస్కార్ట్ చేశారు. తమిళ ప్రాబల్యం గల ఉత్తర ద్వీపకల్పం జాఫ్నాలో ఓటింగ్ సమయంలో మిలటరీ రోడ్లు బ్లాక్ చేసిందంటూ జాఫ్నాలో ప్రజలు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మరియు దళాలు తీవ్ర ప్రతిష్టంభన నెలకొన్న సమయంలో ఈ సంఘటన జరిగింది.

అధ్యక్ష ఎన్నికల బరిలో 35 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ..ప్రధానంగా యునైటెడ్ నేషనల్ పార్టీ (యుఎన్‌పి) డిప్యూటీ లీడర్ సాజిత్ ప్రేమదాస, శ్రీలంక పోదుజన పెరమున (ఎస్‌ఎల్‌పిపి)కు చెందిన గోటబయ రాజపక్సే మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.