108 టైప్ విపన్స్: బీజేపీ నేత షాపులో భారీ ఆయుధాలు సీజ్

బీజేపీ నేత దుకాణంలో భారీ స్థాయిలో ఆయుధాలు బయటపడ్డాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 108 రకాల ఆయుధాలను ముంబై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  • Edited By: sreehari , January 16, 2019 / 09:48 AM IST
108 టైప్ విపన్స్: బీజేపీ నేత షాపులో భారీ ఆయుధాలు సీజ్

బీజేపీ నేత దుకాణంలో భారీ స్థాయిలో ఆయుధాలు బయటపడ్డాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 108 రకాల ఆయుధాలను ముంబై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

థానె: బీజేపీ నేత దుకాణంలో భారీ స్థాయిలో ఆయుధాలు బయటపడ్డాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 108 రకాల ఆయుధాలను ముంబై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని థానెలో బీజేపీ నేత ధనంజయ్ కులకర్ణి షాపులో కల్యాణ్ క్రైం బ్రాంచ్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో షాపులో స్టోర్ చేసిన తుపాకీలు, కత్తులు, పెద్ద కత్తులు, ఖడ్గాలు ఇలా వంద రకాల ఆయుధాలు ఉండటం చూసి పోలీసులే షాకయ్యారు.

థానెలో బీజేపీ డిప్యూటీ చీఫ్ గా కులకర్ణి ఉన్నారు. సోదాల అనంతరం ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ ఆయుధాలు పట్టుబడటంతో పోలీసులు ధనంజయ్ ను జ్యూడీషియల్ కస్టడీకి తరలించారు. ధనుంజయ్ తన వ్యాపారంలో భాగంగా ఆయుధాలను ముంబై నుంచి సేకరించి కల్యాణ్, దుంబివ్లి ప్రాంతాల్లోని స్థానిక గుండాలకు అమ్ముతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.