Fraudster Arrested : సోషల్ మీడియాలో పరిచయం..ప్రేమ,పెళ్లి పేరుతో రూ.25 లక్షలు కాజేసిన యువకుడు

సోషల్ మీడియాలో పరిచయం అయిన యువతిని ప్రేమించానని మాయమాటలు చెప్పి ఆమెనుంచి లక్షల రూపాయల డబ్బులు గుంజుకున్నాడు.

Fraudster Arrested : సోషల్ మీడియాలో పరిచయం..ప్రేమ,పెళ్లి పేరుతో రూ.25 లక్షలు కాజేసిన యువకుడు

Guntur Fraudster Arrested

Fraudster Arrested : సోషల్  మీడియాలో పరిచయం అయిన యువతిని ప్రేమించానని మాయమాటలు చెప్పి ఆమె నుంచి లక్షల రూపాయల డబ్బులు గుంజుకున్నాడు. ఆమెతోనే ఒక కారు కొనుగోలు చేయించి ఆ కారుతో ఉడాయించిన మోసగాడిని గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు.

గుంటూరు నల్లచెరువుకు చెందిన ఓ యువతి విప్రో సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఈమెకు గతేడాది టిండర్  చాటింగ్ యాప్ ద్వారా నల్లపాడు ఏపీహెచ్‌బీ కాలనీకి చెందిన చిల్లంపూడి విజయభాస్కర్ రెడ్డితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ స్ధానికులే కావటంతో ఆమె అతడితో స్నేహం చేయటం మొదలెట్టింది. ఈక్రమంలో విజయభాస్కర్ రెడ్డి ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఇంటీరియర్ పనులు చేసుకునే అతను తానో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌నని అబధ్ధం చెప్పాడు.
Also Read : Heroin Seized In Gujarat Port : గుజరాత్ పోర్టులో రూ.21వేల కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం
ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అప్పటి నుంచి యువతి వద్ద నుంచి విడతల వారీగా లక్షలాది రూపాయలు తీసుకున్నాడు. ఇద్దరం కలిసి సాఫ్ట్‌వేర్ కంపెనీ పెడదామని, పెళ్లాయ్యాక మనకింక ఆర్ధిక ఇబ్బందులుల ఉండవని ఆమెకు నమ్మకం కలిగేలా మాట్లాడాడు. ఈ క్రమంలో యువతికి చెందిన డెబిట్,క్రెడిట్ కార్డులు, బ్యాంకు ఎకౌంట్ల ద్వారా రూ.25 లక్షల రూపాయలు రుణాలు తీయించి, ఆమొత్తాలను తాను తీసుకున్నాడు.

అదే క్రమంలో 2021 మే నెలలో ఆమెతో కారు కొనుగోలు చేయించాడు. మే 25న ఆమెను అరండల్ పేటలోని  ఒక హోటల్‌కు లంచ్‌కు తీసుకువెళ్లాడు. ఆమెకు తెలియకుండా ఆమె బ్యాగులోంచి కారు తాళాలు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. ఎంతసేపటికి రాకపోయేసరికి మోసపోయానని గ్రహించింది.

యువతి అరండల్ పేట  పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ  చేపట్టి  నిందితుడు విజయభాస్కర్ రెడ్డిని సోమవారం అరెస్ట్ చేశారు. అతను ఇలాగే కొంతమంది యువతులను మోసం చేసినట్లు పోలీసు విచారణలో వెల్లడయ్యింది. నిందితుడు తన నేరం ఒప్పుకున్నాడని డీఎస్పీ సుప్రజ తెలిపారు.