Fake Priest : యువతులతో నగ్న పూజలు.. ఆ ఆశ పెట్టి ఘరానా మోసం.. గుంటూరులో వెలుగుచూసిన ఘోరం

Fake Priest : ఆ ముగ్గురు యువతులతో చిలకలూరిపేటలో నగ్న పూజలు చేశాడు నకిలీ పూజారి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. నకిలీ పూజారిని అరెస్ట్ చేశారు.

Fake Priest : యువతులతో నగ్న పూజలు.. ఆ ఆశ పెట్టి ఘరానా మోసం.. గుంటూరులో వెలుగుచూసిన ఘోరం

Fake Priest

Guntur Fake Priest : మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులను టార్గెట్ చేస్తున్నారు. డబ్బు ఆశతో ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు. గుంటూరులో అలాంటి మోసం ఒకటి వెలుగుచూసింది. ఓ నకిలీ పూజారి దారుణానికి ఒడిగట్టాడు. డబ్బు ఆశ పెట్టి యువతుల జీవితాలతో ఆడుకున్నాడు. తాను చెప్పినట్లు వింటే డబ్బులు వస్తాయని నమ్మించాడు. ఒక్కొక్కరికి రూ.50వేలు ఇస్తానని ఆశ పెట్టి ముగ్గురు యువతులను ట్రాప్ చేశాడు. వారిని నగ్నంగా నిలబెట్టి పూజలు చేశాడు ఆ మోసకారి పూజారి. చివరికి, తన పనైపోయాక అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు.

పూజల పేరుతో మోసాలకు పాల్పడుతున్న నకిలీ పూజారిని అరెస్ట్ చేశారు గుంటూరు పోలీసులు. యువతులతో నగ్న పూజలు చేయిస్తే డబ్బులు వస్తాయని ఓ మహిళకు మాయమాటలు చెప్పాడు నకిలీ పూజారి నాగేశ్వరరావు. అతడి మాటలు నమ్మిన మహిళ కర్నూలు జిల్లాకు చెందిన ముగ్గురు యువతులను నగ్న పూజలకు ఒప్పించింది. వారికి రూ.50వేలు చొప్పున ఇప్పిస్తానని ఒప్పందం చేసుకుంది.

Also Read..Boy Dead : చాక్లెట్ దొంగిలించాడని బాలుడిని కొట్టిన మాల్ మేనేజర్.. కాసేపటికే ఊహించని ఘోరం

ఆ ముగ్గురు యువతులతో చిలకలూరిపేటలో నగ్న పూజలు చేశాడు నకిలీ పూజారి. ఆ తర్వాత డబ్బులు ఇవ్వలేదు. దాంతో యువతులను అతడిని నిలదీశారు. ఆ ముగ్గురు యువతులను గోరంట్ల సమీపంలో వదిలేసి పరారయ్యాడు. యువతులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. నకిలీ పూజారిని అరెస్ట్ చేశారు.