Aunty Was Gang Raped : మామకు యాక్సిడెంట్ అయ్యిందని.. అత్తను బయటకు తీసుకెళ్లిన అల్లుళ్లు

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో దారుణం చోటు చేసుకుంది. మావయ్యకు యాక్సిడెంట్ అయ్యిందని చెప్పి అత్తను బయటకు తీసుకెళ్లిన మేనల్లుళ్లు ఆమెపై అత్యాచారం జరిపారు.

Aunty Was Gang Raped : మామకు యాక్సిడెంట్ అయ్యిందని.. అత్తను బయటకు తీసుకెళ్లిన అల్లుళ్లు

Aunty Was Gang Raped

Aunty Was Gang Raped : మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో దారుణం చోటు చేసుకుంది. మావయ్యకు యాక్సిడెంట్ అయ్యిందని చెప్పి అత్తను బయటకు తీసుకెళ్లిన మేనల్లుళ్లు ఆమెపై అత్యాచారం జరిపారు. ఆ తర్వాత నుంచి ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తూ   లైంగికంగా వేధించసాగారు. రెండు నెలలక్రితం  జరిగిన ఈ ఘటన ఇటీవలే వెలుగు చూసింది.

గ్వాలియర్ జిల్లాలోని మహారాజ్‌పురా పోలీసు స్టేషన్ పరిధిలో నివసించే బాధిత మహిళ (24), తన భర్త, పిల్లలతో కలిసి జీవిస్తోంది. ఆమె భర్త ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. వీరి ఇంటికి సమీపంలోనే అరవింద్ మహౌర్, సోనూ మహౌర్ అన్ ఇద్దరు సోదరులు నివసిస్తున్నారు. ఇద్దరూ అక్కడకు దగ్గరలో ఉన్న ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు.  బాధిత మహిళకు ఇద్దరూ మేనల్లుళ్ల వరుస అవుతారు.

దాదాపు రెండు నెలల క్రితం   భర్త రాత్రిపూట ఆటో నడపటానికి బయటకు వెళ్లిన సమయంలో   మేనల్లుళ్లు ఇద్దరూ  ఆమె ఇంటికి వచ్చి  అత్తయ్యా…. మావయ్యకు  యాక్సిడెంట్ అయ్యింది. ఆస్పత్రకి వెళదాం వెంటనే బయలుదేరమని చెప్పి హడావిడి చేశారు. భర్తకు యాక్సిడెంట్ జరిగిందనే సరికి ఆమె ఇంకేమీ ఆలోచించకుండా వారితో బయలు దేరి ఆస్పత్రికి బయలుదేరింది.

నిందితులిద్దరూ ఆమెను ఆస్పత్రికి కాకుండా సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లారు. అక్కడ ఇద్దరూ కల్సి ఆమెపై అత్యాచారం జరిపారు. ఈ విషయం ఎవరికైనా చెపితే ఆమె భర్తను పిల్లలను చంపేస్తామని బెదిరించి ఇంటి దగ్గరకు తీసుకువచ్చి దింపి వెళ్లిపోయారు. ఆతర్వాత నుంచి నిందితులిద్దరూ ఆమెను బ్లాక్ మెయిల్ చేయసాగారు.

రోజూ ఇంటికి వచ్చి తమతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని కోరటం మొదలెట్టారు. ఆమె అందుకు  నిరాకరించటంతో ఆమె పరువు తీస్తామని బెదిరించటం మొదలెట్టారు. వారి బెదిరింపులకు భయపడిన మహిళ ఇంట్లోంచి బయటకు రావటం మానేసింది. దీంతో నిందితులిద్దరూ ఆమెను మరింతగా వేధించటం మొదలుపెట్టారు.

వీరి వేధింపులు భరించలేని మహిళ బుధవారం జులై 28న భర్తకు విషయం చెప్పింది. ఇద్దరూ కలిసి మహారాజ్ పుర పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులిద్దరిపైనా ఐపీసీ సెక్షన్ 376డి…. 363 కింద కేసు నమోదు చేశారు.  పరారీలో ఉన్న నిందితులిద్దరినీ త్వరలో అరెస్ట్ చేస్తామని చీఫ్ పోలీసు సూపరిటెండెంట్ రవిసింగ్ భదౌరియా చెప్పారు.