Gwalior : స్పా ముసుగులో వ్యభిచారం…. నిర్వాహకురాలితో సహా ఆరుగురు మహిళలు అరెస్ట్

10TV Telugu News

Gwalior : మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్ లో స్పా ముసుగులో నిర్వహిస్తున్న వ్యభిచార ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.  నగరంలోని గోవింద్ పురి సమీపంలోని జిటివి టవర్ లో నిర్వహిస్తున్న ఆర్గానిక్ బ్యూటీ పార్లర్, స్పా సెంటర్ లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది.

యూనివర్సిటీ  పోలీసులతో కలిసి క్రైం బ్రాంచ్ పోలీసులు ఆధారాలతో సహా పట్టుకోవాలని ప్లాన్ చేసారు.  శుక్రవారం ఒక కానిస్టేబుల్ ను కస్టమర్ లాగా స్పా   లోపలకు పంపించారు. అక్కడ అతను తనకు కావాల్సిన సేవల గురించి మాట్లాడుకున్నాడు.  ఆక్రమంలో వారు అందిస్తున్నసేవలను కూడా వివరించారు.

అందులో యువతులతో సన్నిహితంగా ఉండే  సేవల గురించి కూడా చెప్పారు.  స్పా సెంటర్  నుండి  కానిస్టేబుల్ ఇచ్చిన  సూచనలతో పోలీసులు దాడి చేసి నిర్వాహకురాలితో పాటు ఐదుగురు యువతులను అరెస్ట్ చేశారు. నిర్వాహాకురాలు బహుదూర్ పుర్ నివాసిగా గుర్తించారు. మిగిలిన యువతులు స్ధానికంగా నివసించే వారుగా పోలీసులు తెలిపారు.

యువతులను నెల జీతం మీద నిర్వాహకులు ఏర్పాటు చేసుకున్నారని.. కస్టమర్ వద్ద నుంచి 3 నుంచి 5 వేలరూపాయల వరకు వసూలు చేసేవారని పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

×