ఎలాంటి తీర్పు వస్తుందో : హాజీపూర్ వరుస హత్యల కేసు..వాదనలు పూర్తి

  • Published By: madhu ,Published On : December 24, 2019 / 09:19 AM IST
ఎలాంటి తీర్పు వస్తుందో : హాజీపూర్ వరుస హత్యల కేసు..వాదనలు పూర్తి

హాజీపూర్‌ వరుస హత్యల కేసులో వాదనలు పూర్తయ్యాయి. నల్లగొండ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో శ్రీనివాస్‌రెడ్డి ట్రయల్స్‌ ముగిశాయి. వారం రోజుల్లో తుది తీర్పు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. తీర్పు ఇవ్వడానికి ముందు నిందితుడు శ్రీనివాసరెడ్డిని మరోసారి కోర్టులో ప్రవేశపెట్టాలని న్యాయమూర్తి ఆదేశించారు. చివరిసారి అతడి అభిప్రాయం తీసుకోనున్నారు. న్యాయమూర్తి ఆదేశాలతో వచ్చే గురువారం శ్రీనివాస్‌రెడ్డిని పోలీసులు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ముందు హాజరుపరుస్తారు. ఆ తర్వాత వరుస హత్యల కేసులో తీర్పు వెలువడే అవకాశాలున్నాయి.

* వరుస హత్యలతో రాష్ట్రాన్ని హడలెత్తించిన హాజీపూర్‌ శ్రీనివాస్‌రెడ్డిని అరెస్ట్ చేసి నెలలు గడుస్తున్నా ఇంతవరకు కోర్టులో కేసు తేలడం లేదనే సంగతి తెలిసిందే.
* ముగ్గురు బాలికలపై అత్యాచారం జరిపి హత్యచేసి.. శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా చేసి బావిలో పూడ్చిపెట్టాడు శ్రీనివాస్‌రెడ్డి. 
* ఏప్రిల్‌ 25న శ్రావణి స్కూల్‌లో స్పెషల్‌ క్లాసులు ముగించుకుని బస్సు కోసం ఎదురుచూస్తుండగా శ్రీనివాస్‌రెడ్డి లిఫ్ట్‌ ఇచ్చాడు. ఆమెను తన బావి దగ్గరకు తీసుకెళ్లి బావిలోకి నెట్టేశాడు. గాయాలతో ఉన్నప్పుడే ఆమెపై హత్యాచారం జరిపాడు.
 

* 2015లో అదృశ్యమైన కల్పనను కూడా తానే హత్యచేసినట్టు పోలీసుల విచారణలో శ్రీనివాస్‌రెడ్డి అంగీకరించాడు. 
* మహాశివరాత్రి రోజున అదృశ్యమైన మనీషాను శ్రీనివాస్‌రెడ్డే హత్య చేశాడు. ఆమెకూ లిఫ్ట్‌ ఇచ్చి బావి దగ్గరకు తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసినట్టు సీపీ వెల్లడించారు. 
* ఈ సైకోను అరెస్ట్‌ చేసి నెలలు గడుస్తున్నా ఇంతవరకు శిక్ష పడకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
* మరి ఈ సైకోపై ఎలాంటి తీర్పు వస్తుందో తెలియాలంటే..కొన్ిన రోజులు వెయిట్ చేయాల్సిందే. 
Read More : నారా లోకేష్ ట్వీట్ : జగనే పెయిడ్ ఆర్టిస్టు