కోర్టుకు లంచమిస్తూ దొరికిన ఇన్‌స్పెక్టర్

కోర్టుకు లంచమిస్తూ దొరికిన ఇన్‌స్పెక్టర్

లంచం తీసుకునే పోలీసుల గురించి విన్నాం. కానీ లంచమిచ్చే పోలీసు ఈయనే. అది కూడా కోర్టుకే నేరుగా లంచమివ్వాలనుకుని అడ్డంగా దొరికిపోయాడు. ఆ పోలీసు కేవలం తాను స్వీట్లు కొనేందుకే డబ్బులు ఇచ్చానని అది లంచం కాదంటూ వాదిస్తున్నాడు. 

బీహార్‌లోని హాజీపూర్ లోకల్ కోర్టులో ఈ ఘటన చోటు అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్డికు (పేష్కర్)కోర్టు రీడర్‌గా పని చేస్తున్న వ్యక్తికి 500 ఇవ్వబోయాడు ఇన్‌స్పెక్టర్. 29 ఆగష్టున ఇన్‌స్పెక్టర్ కిశోర్ శర్మ డబ్బులు ఇచ్చేందుకు ప్రయత్నించాడు. దీంతో వారిని లంచం ఇస్తున్నట్లుగా పరిగణించారు. 

వారిద్దరూ పేష్కార్ వద్ద ఉన్న స్వీట్లు కొనుక్కునేందుకే ఇన్‌స్పెక్టర్ డబ్బులు ఇవ్వబోయాడని చెప్తున్నారు. కోర్టు గదిలో డబ్బుల లావాదేవీలు జరపడం నేరం కాబట్టి ఆ ఇన్‌స్పెక్టర్ చేతికి సంకెళ్లు పడ్డాయని సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ రాఘవ్ దయాల్ తెలిపారు. ఇదే కోర్టులో మరో కేసులోనూ ఇన్‌స్పెక్టర్ నిందితుడిగా ఉన్నాడని ఆయన వెల్లడించారు.