Haryana : పాక్ నుంచి తెలంగాణకు ఆయుధాలు, పేలుడు పదార్థాలు

పాకిస్తాన్ నుంచి తెలంగాణకు ఆయుధాలు సరఫరా చేరవేస్తున్న ఉగ్రవాదుల  ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. హర్యానాలోని కర్నాల్ లో నలుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేయటంతో  ఈవ్యవహారం బయటపడింది.

Haryana : పాక్ నుంచి తెలంగాణకు ఆయుధాలు, పేలుడు పదార్థాలు

haryana arrest

Haryana :  పాకిస్తాన్ నుంచి తెలంగాణకు ఆయుధాలు సరఫరా చేరవేస్తున్న  ఉగ్రవాదుల  ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. హర్యానాలోని కర్నాల్ లో నలుగురు  ఉగ్రవాదులను అరెస్ట్ చేయటంతో  ఈవ్యవహారం బయటపడింది. వారి వద్దనుంచి పెద్ద ఎత్తున పేలుడు పదార్ధాలు, ఆయుధాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

తెలంగాణలోని ఆదిలాబాద్‌కు ఆయుధాలు చేరవేయాల్సిందిగా నిందితులకు ఆదేశాలు అందినట్టు పోలీసులు గుర్తించారు. పాకిస్తాన్ నుంచి ఆదేశాలు అందుతున్నాయని పోలీసుల దర్యాప్తులో నిందితులు వెల్లడించారు. నిందితుల నుంచి కంటైనర్ గన్ పౌడర్, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ ను పిలిపించి వాటిని పరిశీలిస్తున్నారు.
Also Read : Jharkhand: పాపం పసికందు.. వైద్యుల నిర్లక్ష్యం.. పసికందు కాళ్లను కొరుక్కుతిన్న ఎలుకలు
పేలుడు పదార్ధాలను ఆర్డీఎక్స్ గా పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుడు పదార్ధాలను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబరేటరీకి తరలించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా అవి ఏ రకమైన పేలుడు పదార్ధాలో తెలిసే అవకాశం ఉంది.

కర్నాల్ లోని బస్తారా టోల్ ప్లాజా వద్ద నలుగురు అనుమానిత తీవ్ర వాదులను గురువారం తెల్లవారుఝూమున పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ఫిరోజ్‌పూర్ కేంద్రంగా పని చేస్తున్న పాకిస్తాన్ కు చెందిన గ్యాంగ్ స్టర్ బీకేఐ కార్యకర్త హర్విందర్ సింగ్ రిండాకు సన్నిహితులుగా భావిస్తున్నారు.

వీరంతా నిషేధిత ఐఎస్ఐఉగ్రవాద సంస్ధకు చెందిన గుర్‌ప్రీత్ సింగ్, పర్మీందర్ సింగ్, భూపీందర్ సింగ్, అమన్‌దీప్ సింగ్‌లుగా ప్రాధమికంగా గుర్తించారు. వీరిలో గురుప్రీత్ సింగ్ కింగ్ పిన్ గా వ్యవహరిస్తున్నాడు. వీరు ప్రయాణిస్తున్న ఇన్నోవా కారులో మూడు ఐఈడీలు, 30 కాలిబర్ పిస్టల్స్ తో సహా పెద్ద మొత్తంలో పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకుని ఉగ్రవాదులను మధుబన్ పోలీసు స్టేషన్ కు తరలించారు.

ఉగ్రవాదులు ఫిరోజ్ పూర్ నుంచి నాందేడ్ మీదుగా తెలంగాణకు చేరుకునేందుకు ప్లాన్ చేసుకున్నారని పోలీసు సూపరింటెండెంట్ గంగారామ్ పునియా తెలిపారు. పాకిస్తాన్ లోని రిండా డ్రోన్ల సహాయంతో పేలుడు పదార్ధాలను నిందితులకు అందచేసేవాడని గురుప్రీత్ అంగీకరించాడు. ఉగ్రవాదులు అరెస్టు తర్వాత కర్నాల్ పట్టణంలో హై ఎలర్ట్ ప్రకటించారు.

ఉగ్రవాదులు పెద్ద ఎత్తున పేలుడుకు కుట్ర పన్నినట్లు పోలీసులు  గుర్తించారు. మధుబన్ పోలీసులు పేలుడు పదార్ధాల చట్టం, ఆయుధాల చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు. నిందితులతో సంబంధం ఉన్న ఉగ్రవాద సంస్ధను గుర్తించేందుకు ఇంద్రి అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హిమాద్రి కౌశిక్ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేశారు.