Haryana Exams : పరీక్షరాసే అట్టలో స్మార్ట్ ఫోన్..యధేఛ్చగా వాట్సప్‌లో కాపీ

కొన్నేళ్ల క్రితం పరీక్షల్లో కాపీ కొట్టాలంటే స్లిప్పులు తీసుకువెళ్లేవారు. కొన్నాళ్లకు ఆధునిక పధ్దతుల్లో బ్లూ టూత్ ల ద్వారా కాపీ కొడుతున్న వాళ్లను ఫ్లైయింగ్ స్క్వాడ్ సిబ్బంది అరెస్ట్

Haryana Exams : పరీక్షరాసే అట్టలో స్మార్ట్ ఫోన్..యధేఛ్చగా వాట్సప్‌లో కాపీ

Haryana Mass Copying

Haryana Exams : శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అనేది సామెత. కొన్నేళ్ల క్రితం పరీక్షల్లో కాపీ కొట్టాలంటే స్లిప్పులు తీసుకువెళ్లేవారు. కొన్నాళ్లకు ఆధునిక పధ్దతుల్లో బ్లూ టూత్ ల ద్వారా కాపీ కొడుతున్న వాళ్లను ఫ్లైయింగ్ స్క్వాడ్ సిబ్బంది అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు టెక్నాలజీ మారేసరికి స్మార్ట్ ఫోన్ ను పరీక్షరాసే ప్యాడ్ మధ్యలో బిగించి దానిద్వారా కాపీకొట్టటానికి యత్నించాడో విద్యార్ధి.

వివరాలలోకి వెళితే…హర్యానాలో స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు ఆధ్వర్యంలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. సోమవారం ఇంగ్లీషు పరీక్ష సందర్భంగా పలువురు   విద్యార్ధులు కాపీ కొడుతూ పట్టుబడ్డారు.  ఈ క్రమంలో పరీక్షరాయటానికి వచ్చిన ఒక విద్యార్ధి  గ్లాస్  క్లిప్ బోర్డును ఉపయోగించాడు.

గాజు ప్యాడ్ మధ్యలో స్మార్ట్ ఫోన్ అమర్చాడు.  అది కనపడకుండా పేపర్ పెట్టాడు.  అప్పటికే అందులో టెక్స్ట్ బుక్ లోని పాఠం ఫోటోలు, వాట్సప్ ద్వారా వచ్చిన మెసేజ్ లు  చూసి పరీక్ష రాయటం మొదలెట్టాడు. పరీక్ష మధ్యలో ప్లయింగ్ స్క్వాడ్ వచ్చింది.  విద్యార్ధి అట్టను పరీక్షించిన స్క్వాడ్ లోపల స్మార్ట్ ఫోన్ ఉండటాన్ని గమనించింది.  పరీక్షల్లో మోసానికి పాల్పడటంతో అతనిపై కేసు నమోదు చేశారు.

సోమవారం జరిగిన ఇంగ్లీషు పరీక్షలో మొత్తం 457 మంది విద్యార్ధులు కాపీ కొడుతుండగా అధికారులు పట్టుకున్నారు. వీరిలో కొందరు కార్పెట్ కింద స్మార్ట్ ఫోన్ దాచిపెట్టగా….మరికొందరు పాత పధ్దతిలోనే  ప్యాంట్ లో, చొక్కాలో  స్లిప్పులు పెట్టుకు వచ్చి స్క్వాడ్ కు దొరికిపోయారు.

Also Read : Cricket Betting Racket : హైదరాబాద్‌లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు