ఇన్సూరెన్స్ మనీ కోసం చనిపోయానంటూ హైడ్రామా.. పోలీసుల అదుపులో వ్యాపారి

ఇన్సూరెన్స్ మనీ కోసం చనిపోయానంటూ హైడ్రామా.. పోలీసుల అదుపులో వ్యాపారి

సెలవుల కోసం ఫేక్ మెడికల్ సర్టిఫికేట్ వరకూ ఓకే కానీ, Insurance కోసం మరీ డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేయడం కాస్త ఎక్కువే. పైగా అతడి నుంచి రూ.11లక్షలు లూటీ చేశారంటూ హైడ్రామా ఆడాడు. హర్యానాకు చెందిన వ్యాపారి తానే చనిపోయినట్లుగా క్రియేట్ చేసుకుని మూడు రోజుల తర్వాత అతని కారులో గుర్తు తెలియన శవాన్ని ఉంచాడు.

కుటుంబ సభ్యులు ఇచ్చిన కంప్లైంట్ ను బట్టి అతణ్ని ఎవరు చంపారో.. రూ.11లక్షలు ఎవరు దొంగిలించారనే దానిపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. అప్పుడే నిజాలు తెలిశాయి. చనిపోయానని క్లెయిమ్ చేసుకుంటున్న రామ్ మెహర్(35) చత్తీస్‌ఘడ్ లోనే ఉన్నాడని తెలిసింది.



అంతే.. శుక్రవారం బిలాస్ పూర్ కు అతణ్ని పట్టుకొచ్చారు. కారులో దొరికిన శవం కనుక్కోవడానికి ఇన్వెస్టిగేషన్ ఫార్వార్డ్ చేశారు. రామ్ మెహర్ ను సరైన పద్ధతిలో అడిగితే నిజాలు బయటికొస్తాయని.. పోలీసులు చెప్తున్నారు.

మా విచారణల్లో రామ్ మెహర్ కు రెండు ఇన్సూరెన్స్ లు ఉన్నాయి. వాటి మొత్తం రూ.కోటి నుంచి రూ.50లక్షల వరకూ ఉండొచ్చని అనుకుంటున్నారు. అతని చనిపోయాడని డిక్లేర్ చేస్తే కుటుంబానికే ఆ డబ్బులు చెందుతాయి. ఈ మొత్తం ఘటన వెనుక ఉన్న అసలు కారణం ఇదే అని హన్సీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లోకేందర్ సింగ్ శుక్రవారం అన్నారు.

అతని వ్యాపారం సరిగా రన్ అవకపోవడం, అప్పుల్లో కూరుకుపోవడం వంటి సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ జరగడానికి ముందు కుటుంబ సభ్యులు వచ్చి కంప్లైంట్ ఇలా ఇచ్చారు. మెహర్ నుంచి ఫోన్ వచ్చింది. ఎవరో తనను ఫాలో అవుతున్నారని తన దగ్గర డబ్బులు కాజేసి ఏమైనా చేస్తారేమోననే భయంగా ఉందని ఫోన్ లో చెప్పాడని పోలీసులకు వెల్లడించారు.

పోలీసులు వెంటనే రియాక్ట్ అయినప్పటికీ కాలిపోయిన కారు, గుర్తుపట్టలేని స్థితిలో అందులో ఉన్న మృతదేహం కనిపించాయి. దొంగతనం-హత్య కింద అనుమానిస్తూ కేసు దర్యాప్తు చేపట్టారు. ఆ తర్వాతే నిజాలు తెలిశాయి. ఫ్యాక్టరీ నుంచి వస్తుండగా డబ్బు దొంగతనం చేసి హత్య చేయడం అనేది అబద్ధమని తేలింి.

రామ్ మెహర్ కు బర్వాలాలో డిస్పోజబుల్ కప్స్, ప్లేట్లు ఫ్యాక్టరీ ఉంది. నిజానికి అతను బ్యాంకు నుంచి రూ.11లక్షలు విత్ డ్రా చేసుకుని ఇంటికి ప్రయాణమయ్యాడు. ఆ తర్వాత అనుకున్నట్లుగా కథ చిత్రీకరించడానికి కారును కాల్చేయడం, అందులో వేరొకరి శవాన్ని పెట్టడం వంటివి చేశాడు. అందులో ఉన్న శవం ఎవరిదనే కోణంలో దర్యాప్తు జరుగుతుంది.