ఛీ..ఛీ..వీడు తండ్రేనా..కన్నకూతురిని తల్లిని చేశాడు

  • Published By: madhu ,Published On : May 17, 2020 / 01:29 PM IST
ఛీ..ఛీ..వీడు తండ్రేనా..కన్నకూతురిని తల్లిని చేశాడు

కరోనా..ఇసొంటి ఎన్ని వైరస్ లు వచ్చినా మారమంటున్నారు కామాంధులు. ఈ వైరస్ వల్ల ఎన్నో కష్టాలు పడుతున్న వేళ..ఈ దుర్మార్గులు రెచ్చిపోతున్నారు. దేశంలో ఎక్కడో ఒకచోట అత్యాచారాలకు తెగబడుతున్నారు. మానవసమాజం తలదించుకొనేలా వ్యవహరిస్తున్నారు. కూతురు అని చూడకుండా..ఓ తండ్రి చేసిన నిర్వాకం అందర్నీ నిశ్చేష్టులను చేసింది. తరచూగా లైంగిక దాడికి పాల్పడడంతో…గర్భవతి కావడం..ఈ సమయంలో కూడా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇక్కడ ఓ విషయం చెప్పాలి. బాధితురాలు..మానసిక రోగి. 

ఈ విషాద ఘటన హర్యానా పంచుకులాలో చోటు చేసుకుంది. పంచుకుల జిల్లాలోని సెక్టార్ 18 పోలీస్ స్టేషన్ పరిధిలో అబయ్ పూర్ గ్రామంలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. ఇతనికి 23 సంవత్సరాల కూతురు ఉంది. ఈమెకు మానసిక వికలాంగురాలు. అకస్మాత్తుగా కడుపునొప్పి రావడంతో..స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. స్కానింగ్ చేయగా..గర్భవతిని అని తేలింది. ఈ సమయంలో పుట్టిన బిడ్డ చనిపోయింది. 

ఇదే విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియచేశారు. కూతురికి గర్భం ఎలా వచ్చిందనే విషయం తెలియదని చెప్పడంతో నిర్ఘాంతపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు..బాధితురాలి కుటుంబసభ్యులను విచారించారు. తండ్రిపై అనుమానం వచ్చి..విచారించారు.

అప్పుడే షాకింగ్ న్యూస్ చెప్పాడు. సంవత్సరం నుంచి లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నాడు. ఈ విషయం కుటుంబసభ్యులకు తెలియదని చెప్పడంతో అందరూ షాక్ కు గురయ్యారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.