నాకేమీ తెలీదు, బైక్ రాదు.. పోలీసులు ఇరికించారు : జడ్జితో హాజీపూర్ సీరియల్ కిల్లర్

నాకేమీ తెలియదు.. అంతా అబద్దం.. నాకు బైక్ రాదు.. పోలీసులు ఇరికించారు.. ఇదీ హాజీపూర్ సీరియల్ కిల్లర్ శ్రీనివాసరెడ్డి వాదన. జడ్జి అడిగిన ప్రశ్నలకు నిందితుడు ఇచ్చిన

  • Published By: veegamteam ,Published On : January 3, 2020 / 10:44 AM IST
నాకేమీ తెలీదు, బైక్ రాదు.. పోలీసులు ఇరికించారు : జడ్జితో హాజీపూర్ సీరియల్ కిల్లర్

నాకేమీ తెలియదు.. అంతా అబద్దం.. నాకు బైక్ రాదు.. పోలీసులు ఇరికించారు.. ఇదీ హాజీపూర్ సీరియల్ కిల్లర్ శ్రీనివాసరెడ్డి వాదన. జడ్జి అడిగిన ప్రశ్నలకు నిందితుడు ఇచ్చిన

నాకేమీ తెలియదు.. అంతా అబద్దం.. నాకు బైక్ రాదు.. పోలీసులు ఇరికించారు.. ఇదీ హాజీపూర్ సీరియల్ కిల్లర్ శ్రీనివాసరెడ్డి వాదన. జడ్జి అడిగిన ప్రశ్నలకు నిందితుడు ఇచ్చిన సమాధానాలు. హాజీపూర్ బాలికల హత్యల కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులో హాజీపూర్ వరుస హత్యల కేసు విచారణ జరుగుతోంది. శుక్రవారం(జనవరి 3,2020) శ్రావణి కేసులో నిందితుడు శ్రీనివాసరెడ్డి వాదనలు ముగిశాయి. విచారణ సందర్బంగా జడ్జి అడిగిన ప్రశ్నలకు నిందితుడు శ్రీనివాసరెడ్డి విస్తుపోయే సమాధానాలు చెప్పాడు. మరోసారి అదే మాట వినిపించాడు. నాకేమీ తెలియదు, అంతా అబద్దం, నేను అమాయకుడిని అని వాదించాడు.

విచారణ సందర్భంగా 44మంది సాక్షుల వాంగ్మూలాన్ని న్యాయమూర్తి చదివి వినిపించారు. నాకేమీ తెలియదు, అంతా అబద్దం అని శ్రీనివాసరెడ్డి పదే పదే చెప్పాడు. శ్రావణిని బైక్ పై ఎక్కించుకుని వెళ్లినట్లు సాక్షులు చెబుతున్నారని జడ్జి అడిగితే.. నాకసలు బైక్ నడపడమే రాదని శ్రీనివాసరెడ్డి చెప్పాడు. లోదుస్తులపై ఆనవాళ్ల గురించి ప్రశ్నిస్తే.. అది పోలీసుల సృష్టి అని చెప్పాడు. ఘటనా స్థలంలో దొరికిన బీరు బాటిళ్లపై ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి.. దాని సంగతి ఏంటని జడ్జి అడిగితే…. పోలీసుల బలవంతంగా ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారని నిందితుడు శ్రీనివాసరెడ్డి ఆరోపించాడు. పోలీసులు తనను కొట్టి నేరాలు ఒప్పుకునేలా చేశారని ఆరోపణలు చేశాడు.

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌కు చెందిన ముగ్గురు బాలికలపై (పాముల శ్రావణి, తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పన) నిందితుడు శ్రీనివాసరెడ్డి అత్యాచారం జరిపి ఆపై హత్య చేశాడు. ఈ కేసును నల్లగొండ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు విచారిస్తోంది. ఇప్పటికే న్యాయస్థానం.. పోలీసులు, బాధితుల తరుపు వాదనలను వినేసింది. డిసెంబర్ 26న ఓ బాధిత బాలిక కేసులో నిందితుడి వాదనను న్యాయస్థానం వినింది. ఇవాళ(జనవరి 3,2020) శ్రావణి కేసులో నిందితుడి వాదనలు వింది. ఇక మరో బాలిక కేసులో శ్రీనివాసరెడ్డి వాంగ్మూలాన్ని న్యాయస్థానం తీసుకోవాల్సి ఉంది. ఆ తర్వాత వారం రోజుల్లో తీర్పు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. శ్రీనివాసరెడ్డిని ఉరి తీయాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి.

Also Read : తిరుపతిని రాజధాని చేయాలి : టీడీపీ నేత డిమాండ్