ఇసుకను వేడి చేస్తే బంగారం అవుతుందంట..! మోసగాడి వలలోపడ్డ వ్యాపారి..రూ. 50 లక్షలకు టోపీ..

ఇసుకను వేడి చేస్తే బంగారం అవుతుందంట..! మోసగాడి వలలోపడ్డ వ్యాపారి..రూ. 50 లక్షలకు టోపీ..

Heating sand will make it gold : ఇసుకతో ఏం చేస్తాం. ఇళ్లు కడుతాం..ఇసుక నుంచి నూనె తీయవచ్చు..అనేది సామెత. చాలా సామెతలు వాస్తవాలనుంచి పుట్టుకొచ్చినవే. కానీ కొన్నిమాత్రం సందర్భాన్ని ప్రతిబంబించేవిగా ఉంటాయి. కానీ ఇసుక నుంచి కూడా నూనె తీయవచ్చునేమో తెలీదు గానీ ఇసుక నుంచి ఏకంగా బంగారం వస్తుందంటూ ఓ వ్యక్తి మోసానికి తెరలేపాడు.   ఇసుక నుంచి బంగారాన్ని తయారు చేస్తానంటూ  ఓ వ్యాపారికి టోకరా వేశాడు. మోసపోయేవాళ్లు ఉన్నంత కాలం మోసం చేసే వారు ఉంటూనే ఉంటారనడానికి ఉదాహరణగా నిలిచిందీ ఈ ఘటన.

దురాశ దు:ఖానికి చేడు అనే మంచి సామెతను గుర్తించనంత కాలం ఇలా మోసాలు జరుగుతూనే ఉంటాయి.. ఓ మోసగాడు ఇసుక నుంచి బంగారం తీసి ఇస్తానంటూ ఓ.వ్యాపారి దగ్గరి నుంచి రూ. 50 లక్షలకు పైగా దోచేశాడు. టెక్నాలజీలో లోకం దూసుకుపోతున్న ఈ కాలంలో కూడా ఇలా మోసగాడి మాయలో పడిపోతున్నారు జనాలు.

వివరాల్లోకి వెళితే..పూణెలోని హదాస్ పూర్ కు చెందిన ఓ వ్యక్తి నగల వ్యాపారం చేస్తుంటాడు. ఇతనికి కొత్తగా ఓ వ్యక్తి పరిచయమయయ్యాడు. వీరిద్దరి మధ్య ఏడాదిగా పరిచయాలు కొనసాగుతున్నాయి. ఆ వ్యాపారి కుటుంబంతో కూడా స్నేహంగా మెలిగేవాడు. ఈ క్రమంలో…వాళ్లింటికి పాల ఉత్పత్తులను సరఫరా చేసేవాడు. అయితే..ఓ రోజు..నాలుగు కిలోల ఇసుక సంచిని తీసుకొచ్చి..దాన్ని సదరు నగల వ్యాపారికి ఇచ్చాడు.

ఇది సాధారణ ఇసుకలాంటిది కాదు చాలా ప్రత్యేకమైన ఇసుక అని, ఎక్కడా దొరకదని..పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి తెప్పించడం జరిగిందని నమ్మించాడు.  ఈ ఇసుకను వేడి చేస్తే..బంగారం అవుతుందని చెప్పాడు. దాంతో సదరు వ్యాపారి షాక్ అయ్యాడు. ఇది నిజమా అని ఆశ్చర్యపోయాడు. ఆ ఆశ్చర్యాన్ని నిజమని  నమ్మించటంలో మోసగాడు సక్సెస్ అయ్యాడు. అలా ఇసుక నుంచి బంగారం తీయాలంటే కొంత బంగారం కావాలని సూచించాడు. ఆ వ్యక్తి చెప్పిన మాటలను వ్యాపారి తేలికగా నమ్మేశాడు.

రూ. 30 లక్షల నగదు, రూ. 20 లక్షల విలువైన బంగారు ఆభరణాలను అతని చేతిలో పెట్టాడు. తర్వాత..ఇసుక వేడి చేస్తే..బంగారం కాలేదు..కాదు..కదా..మాడిపోయింది. దీంతో సదరు వ్యాపారి మొహం కూడా మాడిపోయింది. ఏం చేయాలో తెలీక లబోదిబోమన్నాడు. పోలీస్ స్టేషన్ కు పరుగెత్తాడు. నిందితుడు మాత్రం బంగారంతో పారిపోయాడు. ప్రస్తుతం అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.