Helium Tank: బెలూన్ల కోసం వాడే హీలియం సిలిండర్ పేలి ఒకరు మృతి.. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యం

బెలూన్లలో గాలి నింపేందుకు వాడే హీలియం సిలిండర్ పేలిన ఘటనలో ఒకరు మరణించారు. మరో 22 మంది గాయపడ్డారు. ఈ ఘటన తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జరిగింది.

Helium Tank: బెలూన్ల కోసం వాడే హీలియం సిలిండర్ పేలి ఒకరు మృతి.. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యం

Helium Tank: తమిళనాడులో విషాదం జరిగింది. హీలియం సిలిండర్ పేలిన ఘటనలో ఒక వ్యక్తి మరణించగా, మరో 22 మంది గాయపడ్డారు. ఈ ఘటన తమిళనాడు, తిరుచిరాపల్లిలోని సిగరతోపు ఏరియాలో ఆదివారం సాయంత్రం జరిగింది. స్థానిక మార్కెట్లో ఒక వ్యక్తి హీలియం బెలూన్లు అమ్ముతున్నాడు.

Human Sacrifice: గంజాయి మత్తులో దారుణం.. నరబలి పేరుతో ఆరేళ్ల బాలుడి హత్య.. నిందితుల అరెస్ట్

దీనికోసం అతడు ఒక హీలియం సిలిండర్ ఏర్పాటు చేసుకున్నాడు. ఆదివారం సాయంత్రం జనం రద్దీగా ఉన్న సమయంలో ఈ హీలియం సిలిండర్ ఉన్నట్లుండి పేలిపోయింది. ఈ ఘటనలో పక్కనే ఉన్న ఒక వ్యక్తి మరణించగా, మరో 22 మంది గాయపడ్డారు. పక్కనున్న కొన్ని వాహనాలు, షాపులు కూడా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యం అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.