అమ్మాయి కోసం ఫ్రెండ్ ని చంపేశాడు : సాఫ్ట్ వేర్ కంపెనీ ఓనర్ హత్య కేసుని ఛేదించిన పోలీసులు

హైదరాబాద్ కేపీహెచ్‌బీలో హత్యకు గురైన సాఫ్ట్‌వేర్ కంపెనీ ఓనర్ సతీష్ హత్య కేసులో పోలీసులు చిక్కుముడిని విప్పారు. పక్కా ప్లాన్ ప్రకారమే సతీష్ ను హేమంత్ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.

  • Published By: veegamteam ,Published On : September 5, 2019 / 08:04 AM IST
అమ్మాయి కోసం ఫ్రెండ్ ని చంపేశాడు : సాఫ్ట్ వేర్ కంపెనీ ఓనర్ హత్య కేసుని ఛేదించిన పోలీసులు

హైదరాబాద్ కేపీహెచ్‌బీలో హత్యకు గురైన సాఫ్ట్‌వేర్ కంపెనీ ఓనర్ సతీష్ హత్య కేసులో పోలీసులు చిక్కుముడిని విప్పారు. పక్కా ప్లాన్ ప్రకారమే సతీష్ ను హేమంత్ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.

హైదరాబాద్ కేపీహెచ్‌బీలో హత్యకు గురైన సాఫ్ట్‌వేర్ కంపెనీ ఓనర్ సతీష్ హత్య కేసులో పోలీసులు చిక్కుముడిని విప్పారు. పక్కా ప్లాన్ ప్రకారమే సతీష్ ను హేమంత్ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. గర్ల్ ఫ్రెండ్ కోసమే హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. కొంతకాలంగా సతీష్ తో హేమంత్‌ గర్ల్‌ఫ్రెండ్‌ చనువుగా ఉంటోంది. దీంతో ఎలాగైనా సతీష్ ను హతమార్చాలని హేమంత్‌ నిర్ణయించుకున్నాడు.
 
ఆగస్టు 27వ తేదీన రాత్రి 8గంటల సమయంలో  హేమంత్ ప్రియాంకను హాస్టల్ దగ్గర డ్రాప్ చేశాడు. మద్యం బాటిల్స్ తీసుకుని ఇంటికి రావాలంటూ హేమంత్..సతీష్ కు ఫోన్ చేశాడు. దాంతో సతీష్ మద్యం బాటిల్స్ తీసుకొని హేమంత్ రూమ్ కు వెళ్లాడు. సతీష్, హేమంత్ మద్యం సేవిస్తుండగా ఆఫీసులో అమ్మాయితో వివాహేతర సంబంధ విషయాన్ని సతీష్ ప్రస్తావించాడు. ఈ సంబంధం మానుకోవాలని హెచ్చరించాడు. ఆ సందర్భంగా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఎప్పటికైనా ఈ విషయాన్ని బయటపెడుతాడని భావించిన హేమంత్..సతీశ్‌ను అడ్డు తొలగించుకోవాలని భావించాడు. 

రాత్రి 9.30 సమయంలో మద్యం సేవిస్తుండగా సతీష్ తలపై హేమంత్ ఐరన్ రాడ్ తో కొట్టాడు. తర్వాత ఇంట్లో ఉన్న కత్తితో గొంతు కోసి చంపేశాడు. తర్వాత శవాన్ని ముక్కలుగా నరకాలని నల్లకవర్లు తీసుకొచ్చాడు. సాధ్యం కాకపోవడంతో భయపడి శవాన్ని అక్కడే పడేసి వెళ్లిపోయి మరుసటి రోజు తొటి స్నేహితులకు విషయాన్ని చెప్పాడు. లొంగిపోవాలని వారు సూచించినా..హేమంత్..బంధువుల ఇంట్లో తలదాచుకున్నాడు. హత్యలో తన ప్రియురాలికి ఎలాంటి సంబంధం లేదని హేమంత్ వెల్లడించినట్లు తెలుస్తోంది. 

విదేశాల్లో ఎంఎస్ పూర్తిచేసిన సతీశ్‌… హైదరాబాద్‌లో ఐటీ విద్యార్ధులకు కోచింగ్ ఇచ్చేవాడు. ఈ క్రమంలో ఐటీ కన్సల్టెన్సీని ప్రారంభించి అందులో తన చిన్ననాటి స్నేహితుడు హేమంత్‌ను పార్ట్‌నర్‌గా చేర్చుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ కోచింగ్ సెంటర్, కన్సల్టెన్సీ పనులతో బిజీ అయ్యారు. ఉన్నట్టుండి సతీశ్‌ కనిపించకపోవడం.. హేమంత్ నివాసంలో రక్తపు మడుగులో మృతదేహమై పడివుండటంతో పోలీసులకు అనేక అనుమానాలు కలిగాయి. హేమంత్‌ పరారవడంతో అతడే హత్య చేశాడని నిర్ధారణకు వచ్చిన పోలీసులు.. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి గాలింపు చేపట్టారు. అయితే.. హేమంత్ ను గుల్బర్గా దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వివాహేతర సంబంధాన్ని ఎక్కడ బయటపెడతాడో అన్న అనుమానంతో సతీష్ ను హత్య చేశానని హేమంత్‌ పోలీసుల ఎదుట అంగీకరించాడు.

Also Read : భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య