ఫిల్మ్ చాంబర్ దగ్గర హీరో ఆత్మహత్యాయత్నం

ఫిల్మ్ చాంబర్ దగ్గర కలకలం రేగింది. నానిగాడు సినిమా హీరో దుర్గాప్రసాద్ ఆత్మహత్యాయత్నం చేశాడు. పురుగుల మందు తాగబోయిన దుర్గాప్రసాద్ ను పోలీసులు అడ్డుకున్నారు.

  • Published By: veegamteam ,Published On : December 11, 2019 / 06:42 AM IST
ఫిల్మ్ చాంబర్ దగ్గర హీరో ఆత్మహత్యాయత్నం

ఫిల్మ్ చాంబర్ దగ్గర కలకలం రేగింది. నానిగాడు సినిమా హీరో దుర్గాప్రసాద్ ఆత్మహత్యాయత్నం చేశాడు. పురుగుల మందు తాగబోయిన దుర్గాప్రసాద్ ను పోలీసులు అడ్డుకున్నారు.

ఫిల్మ్ చాంబర్ దగ్గర కలకలం రేగింది. నానిగాడు సినిమా హీరో దుర్గాప్రసాద్ ఆత్మహత్యాయత్నం చేశాడు. పురుగుల మందు తాగబోయిన దుర్గాప్రసాద్ ను పోలీసులు అడ్డుకున్నారు. అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రూ.40లక్షలు పెట్టి నానిగాడు సినిమా తీశానని, అయితే ఆ సినిమాని కొందరు యూట్యూబ్ లో పెట్టారని దుర్గాప్రసాద్ వాపోయాడు. తాను నష్టపోయాయని, మరోదారి లేకనే ఆత్మహత్యకు యత్నించానని చెప్పాడు. తనకు న్యాయం జరిగేలా చూడాలని ఫిల్మ్ చాంబర్ పెద్దలను కోరాడు దుర్గాప్రసాద్.

యూట్యూబ్‌లో సినిమా లీక్ కావడంపై ‘నానిగాడు’ చిత్రబృందం మంగళవారం(డిసెంబర్ 10,2019) ఫిలిం చాంబర్ ముందు ఆందోళనకు దిగింది. రూ.40 లక్షలు ఖర్చు పెట్టి తీసిన సినిమాకు సెన్సార్ బోర్డు ‘యు’ సర్టిఫికేట్ ఇచ్చిందని.. త్వరలో విడుదలకు సన్నాహాలు చేసుకుంటుంటే.. యూట్యూబ్‌లో పెట్టేశారని దుర్గాప్రసాద్ వాపోయాడు. వెంటనే లింకులు తొలగించాలని డిమాండ్ చేశాడు. లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. అన్నట్టగానే బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.