దిశా నిందితుల ఎన్ కౌంటర్ : మృతదేహాల అప్పగింతపై సందిగ్ధత

  • Published By: madhu ,Published On : December 12, 2019 / 07:57 AM IST
దిశా నిందితుల ఎన్ కౌంటర్ : మృతదేహాల అప్పగింతపై సందిగ్ధత

చటాన్ పల్లి ఎన్ కౌంటర్ ఘటనపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. కుటుంబసభ్యులకు మృతదేహాల అప్పగింతపై 2019, డిసెంబర్ 12వ తేదీ గురువారం విచారణ జరిగింది. ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు జ్యుడీషియల్ ఎంక్వైరీ వేసిందని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు. మృతదేహాల అప్పగింతపై సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. విచారణనను డిసెంబర్ 13వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. 

* దిశా నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టులో పిల్ లు దాఖలైన సంగతి తెలిసిందే. 
* సుప్రీంకోర్టు మాజీ జడ్డి వీఎస్ సిర్పూర్ కర్ నేతృత్వంలో త్రిసభ్య కమిషన్ వేసింది.
* ఆరు నెలల్లో నివేదిక సమర్పించాలని కమిషన్ ను ఆదేశించింది.
* ముంబై హైకోర్టు మాజీ న్యాయమూర్తి రేఖా ప్రకాశ్, మాజీ సీబీఐ డైరెక్టర్ కార్తికేయన్ ఉన్నారు. 
* దిశ హత్యాచార నిందితుల మృతదేహాలను 2019, డిసెంబర్ 09వ తేదీన గాంధీ ఆస్పత్రికి తరలించారు. అంతకుముందు మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో మృతదేహాలు ఉంచారు. 
* దిశ హత్యాచార నిందితులను పోలీసులు 2019, డిసెంబర్ 06వ తేదీ శుక్రవారం తెల్లవారు జామున ఎన్‌కౌంటర్‌ చేశారు. 
* షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి దగ్గర క్రైమ్‌ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు పారిపోవడానికి ప్రయత్నం చేశారు. 
నలుగురు నిందితులను పోలీసులు కాల్చి చంపారు. 
* 2019, నవంబర్ 27వ తేదీన దిశపై నలుగురు నిందితులు అత్యాచారం చేశారు. 
* అనంతరం మృతదేహాన్ని చటాన్‌పల్లి బ్రిడ్జి దగ్గర కాల్చివేశారు. 
* ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్న కేశవులుగా గుర్తించారు.
Read More : యువకుడి గ్యాంగ్ రేప్ : అమ్మాయిలే కాదు.. అబ్బాయిలు