ఏం తెలివి : పల్లీల్లో విదేశీ కరెన్సీ

  • Published By: madhu ,Published On : February 12, 2020 / 04:43 PM IST
ఏం తెలివి : పల్లీల్లో విదేశీ కరెన్సీ

విదేశాల నుంచి బంగారం, డబ్బులు, విలువైన వస్తువులు తరలించడానికి..వినూత్న మార్గాలను స్మగ్లర్లు అనుసరిస్తున్నారు. రోజు రోజుకు కొత్త కొత్త పంథాలు ఎంచుకుంటున్నారు. హాలీవుడ్ మూవీలను తలదన్నేవిధంగా ఉంటున్నాయి. తాజాగా ఓ వ్యక్తి ఆహార పదార్థాల్లో విదేశీ కరెన్సీ తరలిస్తూ పట్టుబడ్డాడు. తనిఖీల్లో అధికారులే షాక్ తిన్నారు. ఈ ఘటన ఢిల్లీ ఎయిర్ పోర్టులో చోటు చేసుకుంది. 

వివరాల్లోకి వెళితే…
ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానం దుబాయ్‌కు వెళుతోంది. మురాద్ ఆలీ..అనే వ్యక్తి కూడా వెళుతున్నాడు. CISF పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆలీ బ్యాగులను చెక్ చేశారు. పల్లీలు, బిస్కెట్లు, చాక్లేట్లు ఉన్నాయని ఆలీ వెల్లడించాడు. కానీ..పల్లీలు తీసుకెళ్లడం ఏంటీ అని అధికారులకు డౌట్ వచ్చింది. పల్లీల పొట్లం తీసి చూశారు. అందులో పల్లీలకు బదులు విదేశీ కరెన్సీలు నోట్లు ఉన్నాయి.

Currency

నోట్లను చుట్టి..పల్లీల్లో పెట్టాడు. బిస్కెట్లు, మీట్ బాల్స్, చాక్లెట్లను కూడా తెరిచి చూశారు. అందులోనూ నోట్ల దొరికాయి. మొత్తం ఆలీ లగేజీ బ్యాగును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మొత్తం 45 లక్షల రూపాయల విలువైన విదేశీ కరెన్సీ లభ్యమైంది. ఆ డబ్బును స్వాధీనం చేసుకుని…ఆలంను కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.