Highway killer Munna : మున్నా భాయ్ నేర చరిత్ర

మహ్మద్‌ అబ్దుల్‌ సయ్యద్ అలియాస్‌ మున్నా. పోలీసులకు ఇది బాగా వెల్‌ నోన్‌ నేమ్‌. జాతీయ రహాదారులపై మారణహోమం సృష్టించిన నరరూప రాక్షసుడు. 17మంది అమాయక లారీ డ్రైవర్లను పొట్టన పెట్టుకున్న దారి దొంగ. నిత్యం దొంగలు, నేరగాళ్ల మధ్యన ఉండే పోలీసులు కూడా ఇతగాడి నేర చరిత్ర చూసి షాక్‌ అయ్యారు.

Highway killer Munna : మున్నా భాయ్ నేర చరిత్ర

Highway Killeer Munna Criminal History

Highway killer Munna : మహ్మద్‌ అబ్దుల్‌ సయ్యద్ అలియాస్‌ మున్నా.  పోలీసులకు ఇది బాగా వెల్‌ నోన్‌ నేమ్‌. జాతీయ రహాదారులపై మారణహోమం సృష్టించిన నరరూప రాక్షసుడు. 17మంది అమాయక లారీ డ్రైవర్లను పొట్టన పెట్టుకున్న దారి దొంగ.   నిత్యం దొంగలు, నేరగాళ్ల మధ్యన ఉండే పోలీసులు కూడా ఇతగాడి నేర చరిత్ర చూసి షాక్‌ అయ్యారు. ఇలాంటి కిరాతకుడి కేసులో ఒంగోలు జిల్లా 8వ అదనపు సెషన్స్ కోర్ట్‌ ఈరోజు తుది తీర్పు వెలువరించింది. మున్నాతో పాటు 11 మందికి ఉరి శిక్ష విధించింది. మరో 7 గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఏడు కేసులకు గానూ  3 కేసులకు న్యాయస్ధానం తీర్పు చెప్పింది,

మున్నా నేర చరిత్ర చూస్తే…..అధికారులమంటూ హైవేలో లారీలు ఆపడం.. డ్రైవర్లను హత్య చేసి లారీలు దొంగిలించడం. ఇదే మున్నా క్రైమ్‌ స్టైల్‌.  ఈ మోస్ట్‌ వాంటెడ్ క్రిమినల్‌ మున్నాను 2008లో అరెస్ట్ చేశారు ప్రకాశం జిల్లా పోలీసులు.  అన్యాయంగా మనుషుల ప్రాణాలు తీసే నరరూప రాక్షసుడితడు. అనేక మంది అమాయకులను పొట్టన పెట్టుకున్న కిరాతకుడు. తన బంధువుల జంట హత్యతో మొదలైన మున్నా నేర పరంపర.. హైవేలో దారి దోపిడీలు చేయడం, పక్క రాష్ట్రలకు గన్స్‌ సప్లై చేయడం వరకూ చేరింది.

తమిళనాడుకు చెందిన ఓ లారీ డ్రైవర్‌ ఇచ్చిన ఫిర్యాదుతో మున్నాను అరెస్ట్‌ చేశారు పోలీసులు. విచారణలో అతని నేరాల చిట్టా మొత్తం బయటికి లాగారు.  హైవేలో జరిగిన లారీ డ్రైవర్ల హత్యలన్నీ మున్నా గ్యాంగ్‌ చేసిందని  నిర్ధారించారు. మున్నా నేర చరిత్ర చూసి పోలీసులే విస్తుపోయారు. ఇప్పటికే ఓసారి బెయిల్‌పై వచ్చి తప్పించుకుపోయాడు మున్నా. అదృష్టం కొద్దీ మళ్లీ ఇప్పుడు దొరికాడు. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు మున్నా తప్పించుకోకుండా కేస్‌ ఫైల్‌ చేశారు.

మున్నాకు ఉరిశిక్ష వేయాలని అతని చేతిలో హత్యకు గురైన వారి కుటుంబ సభ్యులు చేసిన డిమాండ్‌ ఫలించింది. ఇటు పోలీసులు సైతం మున్నాను కఠినంగా శిక్షించాలన్నారు. కేసులో వాదోపవాదాలు విన్న కోర్ట్‌ సోమవారం తుది తీర్పు వెలువరించింది.

సరిగ్గా పదమూడేళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పలు హైవేలపై లారీలు మిస్‌ అయ్యాయి. ఓ దారి దోపిడీ ముఠా వీటిని అపహరిస్తోంది. వాటికి సంబందించిన డ్రైవర్ల ఆచూకీ లేకుండా పోతున్నారు. ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతుండటంతో పోలీసులు వాటిపై దృష్టి పెట్టారు. ఎంత ప్రయత్నించినా.. లారీలకు సంబంధించి ఒక్క క్లూ కూడా కనిపెట్టలేకపోయారు. డ్రైవర్ల ఆచూకీ కూడా వారికి లభించలేదు. ఇలా మొత్తం 17 మంది డ్రైవర్లు కనిపించ కుండా పోయారు.

పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో అనుకోకుండా ఓ పేరు బయటకు వచ్చింది. అదే మహ్మద్‌ అబ్దుల్‌ సయ్యద్‌ అలియాస్‌ మున్నా భాయ్‌. కనిగిరికి చెందిన మున్నా టెన్త్‌ క్లాస్‌ వరకు చదువుకున్నాడు. చెడు తిరుగుళ్లకు అలవాటుపడి చదువు మధ్యలోనే మానేశాడు. మున్నాకు మూఢ నమ్మకాలు ఎక్కువ. గుప్త నిధుల కోసం తిరుగుతూ తవ్వకాలు జరిపేవాడు. మొదటి సారిగా ఒంగోలులో హత్య కేసులో మున్నా పేరు బయటకు వచ్చింది. ఆ తరువాత చాలా నేరాలకు మున్నా పాల్పడ్డాడు. గుప్త నిధులు ఉన్నాయంటూ అమాయకులను మోసం చేయడం, వారి దగ్గర డబ్బులు గుంజడం, తనకు డబ్బు ఇస్తే రాత్రి పూజలు జరిపి వాటిని రెట్టింపు చేస్తానని చాలా మంది అమాయకులను మోసం చేశాడు ఈ కేటుగాడు.

కొన్ని రోజులకు మున్నా తన స్టైల్‌ మార్చుకున్నాడు. ఓ గ్యాంగ్‌ తయారు చేసుకుని దారి దోపిడీలు చేయడం ప్రారంభించాడు. వేరే రాష్ట్రాల నుంచి వచ్చే డ్రైవర్లే ఇతని టార్గెట్. ఆర్టీవో ఆఫీసర్లమంటూ హైవేల్లో లారీలు ఆపేవాళ్లు. లారీ పేపర్స్‌ చూపించాలని డిమాండ్‌ చేసే వాళ్లు. డ్రైవర్లు పేపర్లు వెతికే పనిలో ఉండగా వారిపై దాడి చేసి లారీ స్వాధీనం చేసుకునేవారు. ఎవరైనా ఎదురు తిరిగితే చంపేసి దగ్గర్లో పాతిపెట్టేవాళ్లు. లారీలను ముక్కలు చేసి వాటి పార్ట్స్‌ను సెపరేట్‌గా అమ్ముకునే వాళ్లు ఇందుకోసం అండర్‌ గ్రౌండ్‌ షెడ్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.

ఒంగోలులో మున్నా యాక్టివిటీస్‌ తగ్గిపోవడంతో అతను మారిపోయాడు అనుకున్నారు పోలీసులు. కానీ హైవేలపై దోపిడీలు, హత్యలు చేస్తున్న ముఠా మున్నాదేనని వారికి తెలియదు. ఒక రోజు తమిళనాడుకు చెందిన ఓ డ్రైవర్‌   హైవేపై కొందరు వ్యక్తులు తనపై దాడి చేసి లారీని లాక్కున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.   డ్రైవర్‌ చెప్పిన ఆధారాల ప్రకారం ఈ దోపిడీలు చేస్తున్నది మున్నా ముఠా అని గుర్తించారు పోలీసులు. అతన్ని అరెస్ట్‌ చేసేందుకు వేట ప్రారంభించారు.

పోలీసుల చర్యలను పసిగట్టిన మున్నా రాష్ట్రం నుంచి పారిపోయాడు. బెంగళూరులోని ఓ మాజీ ఎమ్మెల్యేకు  చెందిన తోటలో మున్నా తల దాచుకున్నాడని  పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే అక్కడికి వెళ్లి ముఠాతో సహా నిందితుడ్ని  అరెస్ట్ చేశారు. మున్నా బయటకు రాకుండా అన్ని ఆధారాలతో పటిష్టంగా కేసు నమోదు చేశారు పోలీసులు. కానీ న్యాయవ్యవస్ధలో ఉన్న లొసుగులను వాడుకుని మున్నా బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఏపీలో ఉంటే తనకు డేంజర్‌ అనుకుని అక్కడి నుంచి మహారాష్ట్రకు పారిపోయాడు.

మహారాష్ట్రలో గన్‌ డీలర్స్‌తో లింక్‌ పెట్టుకున్నాడు మున్నా.  వేరే రాష్ట్రాల నుంచి గన్స్‌ తెప్పించి అమ్మేవాడు. అక్కడ జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో మున్నా చనిపోయాడంటూ వార్తలు వచ్చాయి. కానీ మున్నా మాత్రం అక్కడి నుంచి తప్పించుకుని మళ్లీ ఒంగోలుకు వచ్చాడు.  రియల్టర్‌ గా  కొత్త అవతారమెత్తి మోసాలు చేయడం ప్రారంభించాడు. తనకు హైదరాబాద్‌లో చాలా భూములు ఉన్నాయంటూ అమాయకులను మోసం చేశాడు.  ఓ జాతీయ రహదారిపై వ్యక్తిని హత్య చేసి అతని కారును ఎత్తుకెళ్లింది మున్నా గ్యాంగ్‌. ఈ ఘటనతో మున్నా బతికే ఉన్నాడని పోలీసులకు అర్ధమైంది.  అంతే పక్కా ప్లాన్‌ చేసి మున్నాను అరెస్ట్‌ చేశారు.

ఈ సారి మున్నా తప్పించుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.  మున్నా పాపాల చిట్టాను కోర్ట్‌ ముందు ఉంచారు.  ఇలాంటి నేరస్తుడు బయట తిరగడం ప్రమాదకరమని నిరూపించారు. పోలీసులు బలమైన సాక్ష్యాధారాలను  నిరూపించటంతో కోర్టు సోమవారం మున్నాతో సహా అతనిగ్యాంగ్ లోని మరో 11 మందికి ఉరిశిక్ష, నలుగురికి యావజ్జీవ కారాగారశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.