Sameer Wankhede: ‘నిన్ను ఖతం చేస్తాం’.. సమీర్ వాంఖడేకు బెదిరింపు.. పోలీసులకు ఫిర్యాదు

షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌పై డ్రగ్స్ కేసు నమోదు చేసిన అధికారి సమీర్ వాంఖడేను చంపేస్తామంటూ తాజాగా హెచ్చరిక జారీ అయింది. సోషల్ మీడియా ద్వారా సమీర్‌కు వార్నింగ్ ఇచ్చారు. దీనిపై అతడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Sameer Wankhede: ‘నిన్ను ఖతం చేస్తాం’.. సమీర్ వాంఖడేకు బెదిరింపు.. పోలీసులకు ఫిర్యాదు

Sameer Wankhede: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) మాజీ అధికారి సమీర్ వాంఖడేను చంపేస్తామంటూ హెచ్చరిక జారీ అయింది. అమన్ పేరుతో ఉన్న ఒక ట్విట్టర్ ఖాతా నుంచి సమీర్ వాంఖడేకు ఈనెల 14న బెదిరింపు మెసేజ్ వచ్చింది. ‘‘నీవేం చేశావో నీకు తెలుసు.. దానికి తగిన మూల్యం చెల్లించుకుంటావు. నిన్ను ఖతం చేస్తాం’’ అని ఆ ట్వీట్లలో పేర్కొన్నారు.

Indian Students: భారత విద్యార్థులకు గుడ్ న్యూస్.. మెడికల్ విద్యార్థులు తిరిగి రావాలన్న ఉక్రెయిన్

ఈ ట్వీట్లపై సమీర్ గోరేగావ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే పనిలో ఉన్న పోలీసులు, గురువారం సమీర్ వాంఖడే వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు బెదిరింపు వచ్చిన ట్విట్టర్ అకౌంట్ పరిశీలిస్తున్నారు. ఈ అకౌంట్‌కు ఫాలోవర్లు ఎవరూ లేరు. సమీర్ వాంఖడేను బెదిరించేందుకే ఈ అకౌంట్ క్రియేట్ చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. గతంలో ముంబయి ఎన్సీబీ జోనల్ డైరెక్టరుగా పనిచేసిన సమీర్ వాంఖడే 2021 అక్టోబరులో క్రూయిజ్ షిప్‌పై దాడి చేసి బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌తో పాటు మరో 19 మందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

Hyderabad: ఒంటికి నిప్పంటించుకుని ప్రిన్సిపాల్‪‌ను పట్టుకున్న విద్యార్థి.. ఇద్దరికీ గాయాలు

ఈ కేసుకు సంబంధించి అతడిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ కేసును కేంద్ర ఎన్సీబీ బృందానికి అప్పగించారు. అలాగే సమీర్‌ను విధుల్లోంచి తప్పించారు.