Chittoor Home Guard : ఏడాది క్రితం ప్రేమ పెళ్లి.. ఇప్పుడు మరో పెళ్లికి సిధ్దమైన హోం గార్డు

కమ్యూనిటీ పోలీసుగా ఉన్న వ్యక్తి యువతిని  ప్రేమ పెళ్లి చేసుకుని పెద్దలు కాదనే సరికి మరో పెళ్ళికి సిధ్దమయ్యాడు.

Chittoor Home Guard : ఏడాది క్రితం ప్రేమ పెళ్లి.. ఇప్పుడు మరో పెళ్లికి సిధ్దమైన హోం గార్డు

Chittoor Home Guard

Chittoor Home Guard : కమ్యూనిటీ పోలీసుగా ఉన్న వ్యక్తి యువతిని  ప్రేమ పెళ్లి చేసుకుని పెద్దలు కాదనే సరికి మరో పెళ్ళికి సిధ్దమయ్యాడు. దీంతో బాధితురాలు భర్త ఇంటిముందు ధర్నాకు దిగింది.  చిత్తూరు జిల్లా నారాయణవనం  మండలంలోని    ఓ ఇంజనీరింగ్ కాలేజీలో   చెన్నైకి చెందిన శ్రీదేవి  అనే  యువతి సెక్యూరిటీ  విభాగంలో పని చేస్తోంది.

నారాయణవనం   బీసీ  కాలనీకి  చెందిన  రామచంద్రన్  కమ్యూనిటీ  పోలీసుగా ఉంటూ అదే ఇంజనీరింగ్ కాలేజీలో బస్సు డ్రైవర్‌గా   పని చేసేవాడు.   ఇద్దరూ ఒకే కాలేజీలో పని చేయటంతో ఇద్దరూ  ప్రేమించు కున్నారు.  కొన్నాళ్లకు రామచంద్రన్ హోం గార్డుగా ఎంపికయ్యాడు.  వీరిద్దరూ గతేడాది మార్చి 13న నాగులాపురంలో పెళ్లి చేసుకుని తిరుపతిలో కాపురం పెట్టారు.

మూడు నెలల క్రితం రామ చంద్రన్   వివాహం   చేసుకున్నాడని   తెలుసుకున్న  అతని  తల్లితండ్రులు రామచంద్రన్ ను  ఇంటికి  తీసుకు వెళ్ళారు.  అందరినీ  ఒప్పించి ఇంటికి తీసుకు  వెళతానని రామ చంద్రన్ శ్రీదేవి‌కి చెప్పాడు.  అతని మాటలు శ్రీదేవి నమ్మింది.  అద్దె కట్టలేని పరిస్ధితి రావటంతో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో చేరింది.

క్రమంగా  భర్త  నుంచి సమాచారం రావటం ఆగిపోవటంతో ఒక పొలిటికల్ పార్టీ నాయకుడిని సహాయం కోరింది.  ఆదివారం  ఉదయం ఆ పార్టీ మహిళా విభాగం నాయకులతో   కలిసి నారాయణవనం బీసీ కాలనీలో నివాసం   ఉంటున్న  రామచంద్రన్  ఇంటి ముందు దీక్ష చేపట్టింది. }
Also Read : Bride Robbery : అన్నంలో మత్తు మందు కలిపి డబ్బు, నగలతో పారిపోయిన కొత్త కోడలు
సమాచారం  తెలుసుకున్న పోలీసులు అక్కడకు  వచ్చారు. ఎస్ఐ   ప్రియాంక  శ్రీదేవికి  న్యాయం చేకూరుస్తానని  హామీ ఇవ్వటంతో సాయంత్రానికి శ్రీదేవి దీక్ష విరమించింది.  తనభర్త, తనను కలవ నీయకుండా చేసి ఆమె అత్తమామలు అతనికి వేరే పెళ్లి చేసే ఉద్దేశ్యంలో ఉన్నారని శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదుతో అతని తల్లితండ్రులను  విచారిస్తున్నామని ఎస్సై తెలిపారు.