మోడీకి KTR ట్వీట్ : అత్యాచారం చేసిన వాళ్లకు ఉరిశిక్ష వెయ్యాలి

  • Published By: madhu ,Published On : December 1, 2019 / 10:05 AM IST
మోడీకి KTR ట్వీట్ : అత్యాచారం చేసిన వాళ్లకు ఉరిశిక్ష వెయ్యాలి

అత్యాచారం చేసిన వాళ్లకు ఉరిశిక్షే విధించాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్వీట్‌లో వెల్లడించారు. డిసెంబర్ 01వ తేదీ ఆదివారం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ట్వీట్‌ చేశారు. డాక్టర్ ప్రియాంక రెడ్డి కేసు ఘటనపై ఆయన మోడీకి ట్వీట్ చేశారు. ట్వీట్‌లో పలు అంశాలను ప్రస్తావించారు. IPC, CRPC చట్టంలో మార్పులు తేవాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉరి శిక్షపై మళ్లీ సమీక్షకు వెళ్లే అవకాశం ఉండకూడదన్నారు.
 

నిర్భయ అత్యాచారం జరిగి 7 ఏళ్లైనా..నిందితులకు ఉరి పడలేదనే విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. 9 నెలల పాపపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి దిగువ కోర్టు ఉరి వేస్తే…హైకోర్టు జీవిత ఖైదుగా మార్చిందని తెలిపారు. దుమ్ముపట్టిన చట్టాలను మార్చాల్సిన సమయం వచ్చిందన్నారు ఆయన. చట్టానికి భయపడని మానవ మృగాల నుంచి దేశానికి రక్షించేందుకు కృషి చేద్దామన్నారు. 

> హైదరాబాద్‌లో ప్రియాంకారెడ్డి హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
> బాధితురాలిపై దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
> ఆమెను హత్య చేసి పెట్రోల్‌తో నిప్పులు పెట్టిన వైనం ప్రజలను ఆగ్రహానికి గురిచేస్తోంది.
> ఆ నలుగురు నిందితులను ఉరి తీయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 
> నిందితులు ఆమెను ఎంతగా హింసించారో.. వారిని కూడా అదే విధంగా హింసించాలని అంటున్నారు.
> అత్యాచార కేసుల్లో నేర తీవ్రతను బట్టి ఉరి శిక్షలు విధిస్తున్నారు. 
> మిగతా అత్యాచార ఘటనల్లో సాధారణ శిక్షలు అనుభవిస్తున్నారు. 
> బాధిత కుటుంబాలకు న్యాయం జరగడం లేదనే వాదన ఉంది.
> లైంగికదాడులకు పాల్పడుతున్న దోషులకు కఠిన శిక్షలు లేకపోవడం వల్ల నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. 
> నిర్భయ చట్టం కింద ఏ వ్యక్తైనా అమ్మాయిలను వెంటాడినా.. చూపులతో వేధించినా నేరమే. 

Read More : ప్రియాంక హత్య కేసు : చిలుకూరు బాలాజీ టెంపుల్ మూసివేత