అందుకే హత్య చేశాడా? : కూతుర్ని చంపి.. కనిపించడం లేదంటూ డ్రామా

కన్నకూతుర్నే కడతేర్చాడో తండ్రి. కాలేజీలో తనతో పాటు చదువుకునే కుర్రాడితో చనువుగా ఉండటమే అమ్మాయి చేసిన తప్పు. అబ్బాయిలతో స్నేహంగా ఉండటం చూసి తట్టుకోలేని తండ్రి.. ఆగ్రహంతో కన్నబిడ్డనే దారుణంగా హత్యచేశాడు.

  • Published By: sreehari ,Published On : March 31, 2019 / 10:44 AM IST
అందుకే హత్య చేశాడా? : కూతుర్ని చంపి.. కనిపించడం లేదంటూ డ్రామా

కన్నకూతుర్నే కడతేర్చాడో తండ్రి. కాలేజీలో తనతో పాటు చదువుకునే కుర్రాడితో చనువుగా ఉండటమే అమ్మాయి చేసిన తప్పు. అబ్బాయిలతో స్నేహంగా ఉండటం చూసి తట్టుకోలేని తండ్రి.. ఆగ్రహంతో కన్నబిడ్డనే దారుణంగా హత్యచేశాడు.

కన్నకూతుర్నే కడతేర్చాడో తండ్రి. కాలేజీలో తనతో పాటు చదువుకునే కుర్రాడితో చనువుగా ఉండటమే అమ్మాయి చేసిన తప్పు. అబ్బాయిలతో స్నేహంగా ఉండటం చూసి తట్టుకోలేని తండ్రి.. ఆగ్రహంతో కన్నబిడ్డనే దారుణంగా హత్యచేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని చొండీ ప్రాంతానికి చెందిన పాండురంగ్ శ్రీరంగ్ సెగుండే (51) తన 17ఏళ్ల కుమార్తెను ఇంట్లో చంపేసి ఇద్దరు వ్యక్తులతో కలిసి ఆమె మృతదేహాన్ని కాల్చేశాడు.

సగం కాలిన కుమార్తె మృతదేహాన్ని పక్కనే ఉన్న కాలువలో పడేశాడు. మరుసటి రోజు నేరుగా పోలీసు స్టేషన్ కు వెళ్లి తన కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. తండ్రే హంతకుడిని అనుమానించిన పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో క్రైం స్టోరీ రివీల్ చేశాడు. 

కాలేజీలో అబ్బాయిలతో తన కుమార్తె చనువుగా ఉండేదని, రాత్రిపూట గంటలకొద్ది ఫోన్లలో చాటింగ్ చేస్తుండేదని విచారణలో తెలిపాడు. కాలేజీకి వెళ్లేటప్పుడు అబ్బాయిల బైక్ లపై వెళ్లేదని, గట్టిగా ప్రశ్నిస్తే.. స్నేహితులు అంటూ మాట దాటవేసిందని తండ్రి శ్రీరంగ్ చెప్పినట్టు పోలీసు ఇన్స్ పెక్టర్ పాండురంగ్ పవార్ తెలిపారు. కుమార్తె ప్రవర్తనపై ఎన్నోసార్లు తండ్రి హెచ్చరించినా అమ్మాయి పట్టించుకోకపోవడంతో ఆగ్రహంతో తండ్రి శ్రీరంగ్ కుమార్తెను చంపినట్టు విచారణలో తేలింది.

ఇంట్లో కూతుర్ని చంపి కాల్చేన అనంతరం ఆమె మృతదేహాన్ని మార్చి 25న కాలువలో పడేసినట్టు పోలీసుల విచారణలో గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ కేసుపై విచారణలో భాగంగా పోలీసులు 35మందిని ప్రశ్నించారు. దీని ఆధారంగా పోలీసులు తండ్రే హంతకుడు అని భావించిన పోలీసులు శ్రీరంగ్ సహా ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.