China Skyscraper: చైనాలో 42 అంతస్తుల బిల్డింగులో చెలరేగిన మంటలు.. ఆకాశాన్ని తాకేలా ఎగిసిపడ్డ పొగ.. వీడియోలు వైరల్

చైనాలో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 42 అంతస్తులు కలిగిన బిల్డింగులో మంటలు చెలరేగడంతో, ఆ బిల్డింగులోని డజన్ల కొద్ది ఫ్లోర్లు తగలబడి పోతున్నాయి. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

China Skyscraper:  చైనాలో 42 అంతస్తుల బిల్డింగులో చెలరేగిన మంటలు.. ఆకాశాన్ని తాకేలా ఎగిసిపడ్డ పొగ.. వీడియోలు వైరల్

China Skyscraper: చైనాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సెంట్రల్ చైనా సిటీ అయిన చాంగ్షాలోని, హునాన్స్ ప్రావిన్స్‌లో ఉన్న ఒక భారీ బిల్డింగులో శుక్రవారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. 42 అంతస్తులు కలిగిన, అత్యంత ఎత్తైన ఈ బిల్డింగులో మంటలు అంటుకోవడంతో, ఈ మంటల నుంచి వెలువడుతున్న పొగ ఆకాశాన్ని తాకింది.

Guatemala: గ్వాటెమాలా స్వాతంత్ర్య దినోత్సవం రోజు తొక్కిసలాట.. 9 మంది మృతి

ఈ బిల్డింగులో ప్రభుత్వానికి చెందిన టెలికాం కార్యాలయం కొనసాగుతోంది. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ప్రమాదంలో బిల్డింగులోని దాదాపు అన్ని ఫ్లోర్లు మంటల్లో చిక్కుకున్నాయి. అయితే, అగ్ని ప్రమాదంలో ఎవరూ మరణించలేదని అధికారులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక దళం, సహాయక సిబ్బంది రక్షణ చర్యలు కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.