Fire Broke Out : శ్రీకాకుళం జిల్లాలో అగ్ని ప్రమాదం.. ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో మంటలు చెలరేగి 90 వాహనాలు దగ్ధం

ఓ బైక్ బ్యాటరీ పేలిపోవడంతో షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు షోరూం మొత్తం వ్యాపించాయి. భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి.

Fire Broke Out : శ్రీకాకుళం జిల్లాలో అగ్ని ప్రమాదం.. ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో మంటలు చెలరేగి 90 వాహనాలు దగ్ధం

Fire Broke Out

Fire Broke Out : ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కాశీబుగ్గలోని ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో మంటలు చెలరేగడంతో 90 వాహనాలు దగ్ధమయ్యాయి. షోరూంలో ఉన్న ఎలక్ట్రిక్ బైక్ లను చార్జింగ్ పెట్టారు. అయితే ఓ బైక్ బ్యాటరీ పేలిపోవడంతో షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

మంటలు షోరూం మొత్తం వ్యాపించాయి. భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ఈ క్రమంలో పక్కనే ఉన్న హార్డవేర్ షాప్, వైన్ షాప్ లకు కూడా మంటలు వ్యాపించాయి. ఆ ప్రాంతమంతటా దట్టమైన పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

Fire Accident: ముంబై మార్కెట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 20 షాపులు దగ్ధం

సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపుచేస్తున్నారు. షోరూంలో ఉన్న 90 బైకులు దగ్ధమయ్యాయని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.