అందంగా కనిపించకూడదని భార్య జట్టు కత్తిరించిన భర్త, లాక్ డౌన్ లో పెరిగిన గృహహింస కేసులు

కరోనా కట్టడి కోసం ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్ డౌన్ కారణంగా కరోనాను

  • Published By: naveen ,Published On : May 27, 2020 / 08:57 AM IST
అందంగా కనిపించకూడదని భార్య జట్టు కత్తిరించిన భర్త, లాక్ డౌన్ లో పెరిగిన గృహహింస కేసులు

కరోనా కట్టడి కోసం ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్ డౌన్ కారణంగా కరోనాను

కరోనా కట్టడి కోసం ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్ డౌన్ కారణంగా కరోనాను ఎంతవరకు కట్టడి చేయగలిగామో తెలియదు కానీ, భార్యలకు మాత్రం లాక్ డౌన్ శాపంగా మారింది. దేశవ్యాప్తంగా గృహహింస కేసులు పెరిగాయి. ఇళ్లకే పరిమితమైన భర్తలు, కుటుంబసభ్యుల్లో కొందరు శాడిస్టుల్లా బిహేవ్ చేస్తున్నారు. సైకోల్లా మారి భార్యలకు నరకం చూపిస్తున్నారు. సూటిపోటి మాటలతో, చేష్టలతో వారిని హింసిస్తున్నారు. తన భార్య అందంగా ఉండకూడదని ఓ భర్త సైకోలా వ్యవహరించాడు. ఆమె జుట్టు కత్తిరించాడు. అప్పటికీ అతడికి ఆనందం కలగలేదు. గుండు కొట్టించుకోవాలని ఆమెను వేధింపులకు గురి చేశాడు. కర్నాటక రాష్ట్రంలో ఈ దారుణం జరిగింది.

లాక్ డౌన్ లో మహిళలపై పెరిగిన వేధింపులు:
కరోనా లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిన తర్వాత కర్ణాటకలో మహిళలపై దౌర్జన్యం కేసులు పెరిగాయి. భర్త, కుటుంబ సభ్యులు దాడులకు వెనుకాడడం లేదు. అలాంటిదే ఈ ఉదంతం. సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన ఒక హైకోర్టు లాయర్‌ సైకోగా మారాడు. తన భార్య అందంగా కనిపించకూడదని, ఆమె జుట్టు కత్తిరించి చిత్రహింసలకు పాల్పడ్డాడు. గుండు కొట్టించుకోవాలని వేధించాడు. ఇందుకు అంగీకరించకపోవడంతో భార్యను ఇంటి నుంచి గెంటేశాడు. బాధితురాలు వనితా సహాయవాణిని ఆశ్రయించడంతో పైశాచిక భర్త బాగోతం బయటపడింది. 

బయటకు వెళ్లినప్పుడు భార్యను ఎవరూ చూడకూడదని:
వీరికి 8 ఏళ్ల క్రితం వివాహం కాగా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రారంభంలో ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. తర్వాత అనుమానం పెంచుకుని భార్యను వేధించడం మొదలు పెట్టాడు. ఆర్థికంగా వెనుకబడిన బాధితురాలి తల్లిదండ్రులు భర్తతో సర్దుకుపోవాలని కుమార్తెకు నచ్చచెప్పారు. గత కొన్ని రోజులుగా ఇంట్లోనే ఉంటున్న లాయర్ భర్తలో శాడిజం మరింత పెరిగింది. భార్య అందంగా ఉండరాదని ఆమెకు బలవంతంగా జుట్టు కత్తిరించాడు. నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్లినప్పుడు నిన్ను ఎవరూ చూడకూడదు. నేను చెప్పినట్లు వినకపోతే సహించేది లేదంటూ రోజూ కొట్టేవాడు. బాధితురాలు పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించగా, భర్తను పిలిచి రాజీ కుదిర్చి పంపారు. జనవరిలో మళ్లీ ఆమె జుట్టును కత్తిరించడానికి భర్త యత్నించాడు. అయితే పిల్లల కోసం హింసను భరించింది.
 
గుండు చేయించుకోవాలని హింస:
చివరకు గుండు గీయించుకోవాలని ఆమెను బెదిరించాడు. ససేమిరా అనడంతో కొట్టి ఇంట్లో నుంచి బయటికి గెంటేశాడు. ఇద్దరు పిల్లలతో కలిసి ఇంట్లో నుంచి బయటికి వచ్చిన ఆమె పరిచయస్తుల సలహా మేరకు మహిళా సహాయవాణినిని ఆశ్రయించి తన గోడు వెళ్లబోసుకుంది. అక్కడి నుంచి సహాయవాణి సిబ్బంది ఆమెను విద్యారణ్యపుర స్వధార్‌ గృహానికి తరలించారు. విచారణకు హాజరు కావాలని భర్తకు నోటీసులు పంపారు. ఆ లాయర్‌ తన తండ్రిని విచారణకు పంపించి తప్పించుకోవడానికి యత్నించాడు. తన పలుకుబడితో నగర పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో భార్య పైనే ఫిర్యాదు చేశాడు. 

లాక్ డౌన్ లో హెల్స్ లైన్ కు పెరిగిన ఫోన్‌కాల్స్‌:
రాష్ట్రంలో 193 సాంత్వన కేంద్రాలు రోజుకు 24 గంటలూ పనిచేస్తున్నాయి. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో బాధితులకు ఫోన్‌ ద్వారా సాంత్వన పలుకుతున్నారు. రెండు నెలల్లో హెల్ప్‌ లైన్‌ కు 1,294 కు పైగా ఫోన్‌ కాల్స్‌ రాగా అందులో 200కు పైగా ఫోన్‌కాల్స్‌ భర్త, కుటుంబ సభ్యుల దౌర్జన్యాలకు సంబంధించినవి. బాధిత బాలికలు, మహిళలకు సిబ్బంది ఏం చేయాలో చెప్పి ప్రమాదం రాకుండా చూస్తున్నారు. తాత్కాలికంగా స్వధార్‌ గృహాల్లో బాధితులకు ఆశ్రయం కల్పిస్తున్నారు.

కరోనా కట్టడి కోసం దాదాపు రెండు నెలలుగా లాక్ డౌన్ విధించారు. ప్రస్తుతం లాక్ డౌన్ 4వ దశ కొనసాగుతోంది. మే 31వ తేదీతో లాక్ డౌన్ 4వ దశ ముగుస్తుంది. లాక్ డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన భర్త, కుటుంబసభ్యులు మహిళలను వేధింపులకు గురి చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. గృహహింస గురించి కొందరు మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. కొందరు మాత్రం పరువు పోతుందనే భయంతో వేధింపులను సహిస్గూ మౌనంగా ఉండిపోతున్నారు.

Read: ఇదో కొత్త ట్రెండ్: పోర్న్ స్టార్లకు డబ్బులిచ్చి వారితో మాజీ ప్రియులను తిట్టిస్తున్నారు!