భార్యను హత్య చేసేందుకు రూ.2 లక్షలు సుపారి ఇచ్చిన భర్త

భార్యను హత్య చేసేందుకు రూ.2 లక్షలు సుపారి ఇచ్చిన భర్త

Husband has allegedly hired contract killers to kill wife, for opposing his illegal affair : అగ్నిసాక్షిగా  తాళి కట్టి ఏడడుగులు వేసిన భర్త పరాయి స్త్రీ తో ఎపైర్ నడుపుతున్నాడని అడిగినందుకు కిరాయి హంతకులతో భార్యను తుదముట్టించాడు భర్త. పోస్ట్ మార్టం  రిపోర్టులో నిజం బయటపడటంతో బార్య, అతని ప్రియురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు మరో నలుగురు కిరాయి హంతకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఒడిషాలోని నయాగర్ జిల్లా సరంకుల్ పోలీసు స్టేషన్ పరిధిలో నివసించే అఖి మొహాపాత్ర, భార్య సుస్మిత తో కలిసి జీవిస్తున్నారు. గత నెల 29వ తేదీన సుస్మిత తన ఇంట్లో   సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని  ఆత్మహత్య చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్ధలికి వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా సుస్మిత ఆత్మహత్య చేసుకోలేదని ఆమెది హత్య అని వైద్యులు ఇచ్చిన నివేదికలో తేలింది.  పోలీసులు సుస్మిత భర్త అఖిని అదుపులోకి తీసుకున్నారు. అతని ఫోన్ కాల్స్ విశ్లేషించారు. దీంతో పోలీసులకు కేసు చిక్కుముడి వీడిపోయింది. పోలీసులు తమదైన స్టైల్లో విచారించే సరికి అఖి కధ మొత్తం వివరించాడు.

అఖి అదే ప్రాంతానికి చెందిన మరోక మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలిసిన సుస్మిత భర్తతో తరచూ గొడవలు పడసాగింది.  తను సంతోషంగా మరోక మహిళతో ఎంజాయ్ చేయాలంటే భార్య ఉండకూడదని నిర్ణయించుకున్నాడు. ఏం చేయాలా అని ఆలోచించాడు. తన చేతికి మట్టి అంటకుండా ఉండేందుకు ప్రోఫెషనల్ కిల్లర్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. భార్యను హత్య చేసేందుకు రూ. 2లక్షలు బేరం మాట్లాడుకున్నాడు.

అందులో భాగంగా జనవరి 29వ తేదీ రాత్రి ఇద్దరు కిరాయి హంతకులు వారి ఇద్దరు అనుచరులతో కలిసి అఖి ఇంటికి వచ్చారు. భర్త కోసం వచ్చినట్లుగా ఆమెను తలుపు కొట్టి అడిగారు. ఆమె తలుపు తీయగానే ఇంటిలోనికి ప్రవేశించి, ఆమెను గొంతు నులిమి ఊపిరి ఆడకుండా చంపారు.  అనంతరం ఆమె దేహాన్ని ఫ్యానుకు వేలాడదీసి ఆత్మహత్య చేసుకున్నట్లు  క్రియేట్ చేసి అక్కడి నుంచి జారుకున్నారు.

పని అయిపోయినట్లు అఖికి ఫోన్ చేసి చెప్పారు.  కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చిన అఖి భార్య ఫ్యానుకు ఉరివేసుకుని ఉండటం చూసి ఏడుస్తూ పోలీసులకు ఫోన్ చేశాడు.  ఘటనా స్ధలానికి వచ్చిన  పోలీసులు పంచనామా నిర్వహించి  మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

కానీ పోస్టుమార్టం నివేదికలో సుస్మితను ఎవరో గొంతు నులిమి చంపి హత్య చేశారని తేలింది. దీంతో పోలీసులు భర్తను అదుపులోకి తీసుకుని, అతని ఫోన్ కాల్స్ లిస్ట్  విశ్లేషించగా వేరొక మహిళతో సంబంధం ఉన్నవిషయం బయట పడింది. ఆమెను అదుపులోకి తీసుకుని ఇద్దర్నీ విచారించగా అఖి అసలు విషయం బయటపెట్టాడు.

అఖి ఇచ్చిన సమాచారం తో నలుగురు కిరాయి హంతకులను అదుపులోకి తీసుకుని వారి వద్దనుంచి రూ. 20వేల నగదు, హత్యకు ఉపయోగించిన పరికరాలు, మోటారు సైకిల్ ను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని సారంకుల్ పోలీసులు తెలిపారు.