Latest
Husband kill wife : ఆడపిల్లలే పుడుతుండటంతో భార్యను హత్య చేసిన భర్త
భార్య ఆడపిల్లల్నే కంటోందని ఆమెను హత్య చేసిన కిరాతక భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు.
భార్య ఆడపిల్లల్నే కంటోందని ఆమెను హత్య చేసిన కిరాతక భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు.
Updated On - 11:53 am, Wed, 7 April 21
Husband killed wife : భార్య ఆడపిల్లల్నే కంటోందని ఆమెను హత్య చేసిన కిరాతక భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. నార్సింగి మండలం జప్తిశివనూర్, కాశ్య తండాకు చెందిన జహీరాబి అనే మహిళ మార్చి 31న నిద్రలోనే కన్ను మూసింది. తన కూతురుని అల్లుడే హతమార్చాడని ఆరోపిస్తూ.. ఆమె తల్లి హైదర్ బీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైదర్ బీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసు విచారణలో భార్యను చంపింది తానేనని భర్త బషీర్ అంగీకరించాడు.
బషీర్ జహీరాబి దంపతులకు నలుగురు కుమార్తెలు పుట్టారు. ఒక కుమార్తె మరణించింది. మగపిల్లవాడి కోసంమరో పెళ్ళిచేసుకుంటానని భార్యను వేధించేవాడు. పలు మార్లు పెద్దలవద్ద పంచాయతీ జరిగినా ఎవ్వరి మాట వినకుండా మరో విహాహం చేసుకున్నాడు. ఒకే ఇంట్లో ఇద్దరు భార్యలతో కాపురం పెట్టాడు.
దీంతో జహీరాబీ తో తరచూ గొడవలు పడేవాడు. ఎలాగైనాభార్యను వదిలించుకోవాలనుకున్నాడు. మార్చి 31వ తేదీన ఇంట్లో నిద్రిస్తున్న భార్యను హత్య చేశాడు. జహీరాబీ తల్లి హైదర్ బీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారం రోజుల్లోనే కేసును చేధించగలిగారు.
ORR Toll Charges : ఓఆర్ఆర్ పై టోల్ చార్జీలు పెరిగాయి
Heavy Rains : రైతన్నను ముంచిన అకాల వర్షాలు
YS Sharmila : ఏదో ఒక రోజు తెలంగాణకు సీఎం అవుతా..అప్పటివరకు మంచి నీళ్లు కూడా ముట్టను.. షర్మిల శపథం..
YS Sharmila : లోటస్పాండ్ దగ్గర దీక్ష కొనసాగిస్తున్న వైఎస్ షర్మిల
Uru Vada News : ఊరు వాడ.. 60 న్యూస్
వైఎస్ షర్మిల అరెస్ట్