Cruel Husband : భార్యను షికారు తీసుకువెళ్లాడు… హైవే రాగానే బైక్ ఆపి….. ?

ఉత్తర‌ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. బారాబంకి జిల్లాలో భార్యతో మనస్పర్ధలు రావటంతో భార్యను హత్యచేసేందుకు భర్త కొత్త ట్రిక్క ప్రయోగించాడు.

Cruel Husband : భార్యను షికారు తీసుకువెళ్లాడు… హైవే రాగానే బైక్ ఆపి….. ?

Husband Murder Attempt On Wife Uttar Pradesh

Cruel Husband :  ఉత్తర‌ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. బారాబంకి జిల్లాలో భార్యతో మనస్పర్ధలు రావటంతో భార్యను హత్యచేసేందుకు భర్త కొత్త ట్రిక్క ప్రయోగించాడు.

బారాబంకి జిల్లాలోని సఫ్దర్‌జంగ్ పోలీసు‌స్టేషన్ పరిధిలో  మేల్‌రాయ్‌గంజ్ గ్రామానికి చెందిన అరుణ్, జ్యోతి భార్యాభర్తలు. వారికి ఒక కూతురు ఉంది.  కొన్నాళ్లుగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చాయి.  దీంతో వారు తరచూ గొడవలు పడుతున్నారు. ఈ క్రమంలో భార్యను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు అరుణ్.

ఒక రోజు సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి వస్తూనే  భార్యను   రెడీ అవమని చెప్పాడు. కూతురుతో సహా రెడీ అవుతున్న భార్యతో కూతురు వద్దు… మనిద్దరమే వెళ్దాం అని చెప్పాడు. సరే అని ఆమె రెడీ అయ్యింది.  భర్త బైక్ ఎక్కి    బయలు దేరింది.   ఎక్కడకు   తీసుకువెళుతున్నాడో తెలియకపోవటంతో  జ్యోతి మౌనంగానే బైక్ పై కూర్చుంది.

అరుణ్ బైక్‌ను  హైవే పైకి తీసుకు వచ్చాడు. హైపే పై   కొంతదూరం వెళ్లాక   ఒక పక్కగా  బైక్  ఆపి భార్యను దిగమన్నాడు.  బైక్ హైవే మీదే స్టాండ్ వేసి నిలబడ్డాడు.  భర్త ఏమి  మాట్లాడతాడా అని ఎదురు చూస్తున్న  జ్యోతికి   భర్త  ఊహించని  షాక్ ఇచ్చాడు.  హైవే పై  నిలబడి  ఉండగా అటుగా వస్తున్న  లారీ  కిందకు భార్యను తోసేశాడు.

Also Read : Lovers Suicide Attempt : ప్రేమజంట ఆత్మహత్య…ప్రియురాలు మృతి..ప్రియుడు సేఫ్ ?

అరుణ్ చేసిన పనికి షాక్ కు   గురైన జ్యోతి కంగుతింది.  అదృష్టం కొద్ది జ్యోతి లారీ కింద పడలేదు.  డ్రైవర్ అప్రమత్తతతో లారీని పక్కకు తప్పించి తీసుకువెళ్ళాడు.  కింద పడిన జ్యోతికి   తీవ్ర గాయాలయ్యాయి.  తాను అనుకున్నట్లు జరగకపోవటం…జ్యోతి బతికి పోవటంతో తన బండారం బయటపడుతుందని  భయపడ్డ  అరుణ్ దగ్గర్లో ఉన్న ఒక కర్ర తీసుకుని భార్యను చితక బాదాడు.  భర్త కొట్టిన దెబ్బలకు జ్యోతి చేసిన ఆర్తనాదాలు విన్న ప్రయాణికులు తమ వాహానాలు ఆపి అటు వచ్చారు.

వారిని చూసి అరుణ్ అక్కడి నుంచి పరారయ్యాడు. జ్యోతి వద్దకు  వచ్చిన బాటసారులు ఆమెను అడిగి ఆమె తల్లి తండ్రులకు ఫోన్ చేసి చెప్పారు. కొద్ది సేపట్లోనే   ఘటనా స్ధలానికి వచ్చిన జ్యోతి తల్లితండ్రులు, బంధువులు జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. ఆమెను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి  చికిత్స అందించారు.  అల్లుడు అరుణ్ పై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.  కేసు నమోదు చేసుుకున్న పోలీసులు కొద్ది సేపట్లనే అరుణ్ ను అరెస్ట్ చేశారు.