Saree Rob : భార్యకు గిఫ్ట్‌గా ఇచ్చేందుకు చీర చోరీ చేసిన భర్త, జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు

తన భార్యకు ఖరీదైన చీరని గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకున్న ఓ భర్త ఏకంగా దొంగగా మారాడు. ఖరీదైన చీరని చోరీ అయితే చేసాడు కానీ, అడ్డంగా దొరికిపోయాడు. కటకటాల పాలయ్యాడు.

Saree Rob : భార్యకు గిఫ్ట్‌గా ఇచ్చేందుకు చీర చోరీ చేసిన భర్త, జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు

Saree Rob

Saree Rob : తన భార్యకు ఖరీదైన చీరని గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకున్న ఓ భర్త ఏకంగా దొంగగా మారాడు. ఖరీదైన చీరని చోరీ అయితే చేసాడు కానీ, అడ్డంగా దొరికిపోయాడు. కటకటాల పాలయ్యాడు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి కత్తి చూపించి ఖరీదైన చీర దొంగిలించాడు. 24 గంటల్లోనే పోలీసులు అతడిని పట్టుకున్నారు. కఠినమైన జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద కేసు నమోదుచేశారు.

గురువారం రాత్రి 8 గంటల సమయంలో ఉజ్జయిని టవర్‌ చౌక్‌లోని చీరల దుకాణానికి వెళ్లిన ఓ వ్యక్తి కత్తి చూపి బెదిరించాడు. అడ్డుకోబోయిన వారికి పక్కకు నెట్టాడు. షాపులో డబ్బు, ఇతర ఖరీదైన వస్తువులేమీ ముట్టుకోలేదు. కేవలం ఒక్క చీర కోసమే ఇలా చేశాడు. సీసీ టీవీ ఫుటేజ్‌ ఆధారంగా దొంగతనానికి పాల్పడింది విక్కీ అనే పాత నేరస్థుడని పోలీసులు గుర్తించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది.

రంగంలోకి దిగిన పోలీసులు 16 గంటల్లోనే విక్కీని అరెస్టు చేసి ఎన్‌ఎస్‌ఏ చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసుల చర్యపై విమర్శలు రావడంతో రావడంతో వివరణ ఇచ్చారు. నిందితుడిపై పలు పోలీస్ స్టేషన్లలో 16 కేసులున్నాయని, గతంలో ఇలాంటి దోపిడీలు చేశాడని, అందుకే కఠినమైన చట్టం ప్రయోగించామని చెప్పారు. కాగా షాపులో ఎర్ర చీర తనకు తెగ నచ్చిందని, తన భార్యకు బహుమతిగా ఇచ్చేందుకే దాన్ని దొంగిలించానని నిందితుడు పోలీసుల విచారణలో చెప్పడం విశేషం.