Hyderabad Kidnap Case : ఐటీ అధికారుల పేరుతో బావను కిడ్నాప్ చేసి రూ.30 లక్షలు దోచేసిన బావమరిది..పంజాగుట్ట కిడ్నాప్ కేసులో ట్విస్ట్

పంజాగుట్ట కిడ్నాప్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. జనవరిలో పంజాగుట్టలో జరిగిన కిడ్నాప్ కేసులో అసలు సూత్రధాని బాధితుడు బావమరిదేనని పోలీసుల విచారణలో నిర్ధారణ అయ్యింది.ఐటీ అధికారుల పేరుతో బావను కిడ్నాప్ చేసి రూ.30 లక్షలు దోచేసిన బావమరిది..ప్లాన్ ను పోలీసులు బయటపెట్టారు.

Hyderabad Kidnap Case : ఐటీ అధికారుల పేరుతో బావను కిడ్నాప్ చేసి రూ.30 లక్షలు దోచేసిన బావమరిది..పంజాగుట్ట కిడ్నాప్ కేసులో ట్విస్ట్

twist in the Panjagutta kidnapping case

Hyderabad Kidnap Case : డబ్బుల కోసం సొంత బంధువులే కిడ్నాప్ లు,హత్యలకు పాల్పడుతున్నారు. ఎన్నో కేసుల్లో సొంత బంధువులే డబ్బుల కోసం ఇటువంటి దారుణాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్ నగరంలోని పంజాగుట్టలో జరిగిన కిడ్నాప్ కేసులో కూడా అదే జరిగింది. గత జనవరిలో పంజాగుట్టలో జరిగిన కిడ్నాప్ కేసును పోలీసులు ఛేధించారు. ఈ కేసులో సొంత బావమరిదే సూత్రధాని అని పోలీసులు విచారణలో నిర్ధారణ అయ్యింది. బావను కిడ్నాప్ చేసి రూ.30లు దోచేశాడని పోలీసులు తెలిపారు. ఈ కేసును ఛేధించిన పోలీసులు బాధితుడు మురళి బావమరిది రాజేశ్ తో సహా ఆరుగురిని అరెస్ట్ చేశారు.

ఐటీ అధికారులం అంటూ మురళీ అనే వ్యక్తిని కొంతమంది గత జనవరిలో కిడ్నాప్ చేశారు. తరువాత సిటీ శివారుల్లోకి తీసుకెళ్లి ఇన్ కమ్ ట్యాక్స్ కింద రూ.60లక్షలు కట్టాలని డిమాండ్ చేశారు. కానీ దానికి మురళీ అంగీకరించలేదు. దీంతో సదరు వ్యక్తులు మురళీని కొట్టారు. నీ భార్యను, బావమరిదిని కూడా అరెస్ట్ చేస్తామని బెదిరించారు. దీంతో భయపడిన మురళి భార్యకు ఫోన్ చేసి రూ.30లక్షలు బావమరిది రాజేశ్ కు ఇవ్వమని చెప్పి తెప్పించాడు. అలా ఆ రూ.30లక్షలు పట్టుకుని మురళీని వదిలేశారు సదరు వ్యక్తులు. దీంతో మురళీ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈకేసులో మురళీ బావమరిది రాజేశ్ అసలు సూత్రధాని అని తేల్చారు. రాజేశ్ తో పాటు ఆరుగురిని అరెస్ట్ చేశారు.

అమీర్‌పేటకు చెందిన మురళీ కృష్ణ అనే వ్యక్తి ఓవర్‌సీస్‌ జాబ్‌ కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. గత జనవరి 27న లాల్‌బంగ్లా సమీపంలోని స్కూల్లో పిల్లల్ని వదిలి తిరిగి వస్తుండగా కారులో వచ్చిన ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు అడ్డుకున్నారు. తాము ఇన్ కమ్ ట్యాక్స్ అధికారం మిమ్మల్ని విచారించాలి అని చెప్పి కారులో బలవంతంగా ఎక్కించుకుని నగర శివారులోని బాటసింగారంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అనంతరం ఏవేవో పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేశారు. ఆ తరవాత ఇన్ కమ్ ట్యాక్స్ కింద రూ.60 లక్షలు కట్టాలని చెప్పారు. దానికి మురళీ అంగీకరించకపోవడంతో కొట్టారు.

అడిగినంత ఇవ్వకపోతే మీ బావమరిది రాజేశ్ ను. నీ భార్యను అరెస్ట్ చేసి జైల్లో వేస్తామని..దీంతో భయపడిన మురళీ తన భార్యకు జరిగింది చెప్పి.. రూ.30 లక్షలు సిద్ధం చేయించి..బావమరిదికి డబ్బులు ఇచ్చి రప్పించారు. అక్కడ బ్యాగ్‌ తీసుకున్న తర్వాత.. నిందితులు మురళీను హయత్‌నగర్‌ వద్ద వదిలేసిపోయారు. అక్కడి నుంచి ఇంటికి చేరుకున్న బాధితుడు మురళి.. పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. బావమరిది రాజేశ్ అసలు సూత్రధాని అని తేల్చారు.