Hyderabad : అఫ్జల్ గంజ్ దారి దోపిడీ కేస్ ఫేక్ ?

సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. స్టీల్ వ్యాపారి జోగ్ సింగ్.. ప్రాపర్టీ డీల్ కోసం రాజస్థాన్ లో ల్యాండ్ అమ్మి 50 లక్షలు కలెక్ట్ చేశారు.

Hyderabad : అఫ్జల్ గంజ్ దారి దోపిడీ కేస్ ఫేక్ ?

Fake

Afzal Gunj road robbery : హైదరాబాద్ అఫ్జల్ గంజ్ దారి దోపిడీ కేస్ ఫేక్ అని తెలుస్తోంది. అఫ్జల్ గంజ్ దారి దోపిడీ ఉట్టి డ్రామా అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసు విషయంలో పోలీసులు ఇప్పటికే ఐదు టీమ్ లుగా రంగంలోకి దిగారు. టాస్క్ ఫోర్స్, సుల్తాన్ బజార్ ఏసీపీ క్రైమ్ పార్టీ, డేటక్టీవ్ పోలీస్ లతో టీంలు ఏర్పాటు చేశారు. సీన్ ఆఫ్ అఫెన్స్ కి పోలీసు విచారణలో బాధితుడు మిటలాల్ రాజ్ పురోహిత్ పొంతన లేని విషయాలు వెల్లడిస్తున్నారు.

సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. స్టీల్ వ్యాపారి జోగ్ సింగ్.. ప్రాపర్టీ డీల్ కోసం రాజస్థాన్ లో ల్యాండ్ అమ్మి 50 లక్షలు కలెక్ట్ చేశారు. హోలీకి మార్కెట్ బంద్ కావడంతో ఇంట్లో డబ్బు పెట్టమని తన వద్ద పనిచేసే మిట్ట లాల్ కి జోగ్ సింగ్ ఇచ్చాడు. జోగ్ సింగ్ దగ్గర ఈ మధ్యే మిట్ట లాల్ పనికి చేరారు.

Traffic Challan : ట్రాఫిక్ చలాన్ క్లియరెన్స్‌‌కు ఫుల్ రెస్పాన్స్.. రూ. 140 కోట్ల జరిమాన వసూల్

చోరీ తెలిసిన వారి పనేనా? లేక జోగ్ సింగ్ వద్ద పనికి చేరిన మిట్ట లాల్.. రాజ్ పురోహిత్ డబ్బులు కొట్టేసి కట్టు కథ అల్లాడా? అని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.