Hyderabad Constable : స్నేహితుడి కోసం ష్యూరిటీ సంతకం….జీతం రాక ఆత్మహత్య చేసుకున్నకానిస్టేబుల్

స్నేహితుడి లోన్ కోసం ఓ కానిస్టేబుల్ ష్యురిటీ సంతకం పెట్టాడు. ఆ స్నేహితుడు లోన్ కట్టకపోయే సరికి ఇతని జీతంలోంచి వసూలు చేస్తున్నారు. జీతం రాని కానిస్టేబుల్ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

Hyderabad Constable :  స్నేహితుడి కోసం ష్యూరిటీ సంతకం….జీతం రాక ఆత్మహత్య చేసుకున్నకానిస్టేబుల్

Constable End His Life

Hyderabad Constable end his life : స్నేహితుడి లోన్ కోసం ఓ కానిస్టేబుల్ ష్యురిటీ సంతకం పెట్టాడు. ఆ స్నేహితుడు లోన్ కట్టకపోయే సరికి ఇతని జీతంలోంచి వసూలు చేస్తున్నారు. జీతం రాని కానిస్టేబుల్ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

ఆటో డ్రైవర్ బానోత్ భిక్షం భార్య రేణుక, కుమారులు అభిలాష్ నాయక్ , ప్రభునాయక్ లతో కలిసి హైదరాబాద్, మూసారం బాగ్ డివిజన్ బాలదానమ్మ బస్తీలో నివసిస్తున్నాడు. పెద్ద కొడుకు అభిలాష్ నాయక్ (33) కు 2014 లో కానిస్టేబుల్ గా ఉద్యోగం వచ్చింది. గవర్నమెంట్ క్వార్టర్స్ లో కింది పోర్షన్‌లో అభిలాష్‌ భార్యాభర్తలు, తల్లిదండ్రులు ఉంటుండగా.. రెండో ఫ్లోర్‌లో చిన్నకుమారుడు ప్రభునాయక్‌ ఉంటున్నాడు.

అభిలాష్‌ కు భార్య ఇంద్రజ్యోతి, ధీరజ్, హేమంత్‌ ఇద్దరు పిల్లలు. ఆరేళ్లుగా మాదన్నపేట పోలీసు స్టేషన్ లో విధులు నిర్వహిస్తుండగా.. అతని సోదరుడు ప్రభునాయక్‌ జీహెచ్‌ఎంసీ డిజాస్టర్‌ విభాగంలో పనిచేస్తున్నాడు. ఇలా ఉండగా.. అభిలాష్‌ తన భార్య జ్యోతి, ఇద్దరు పిల్లలను శుక్రవారం కోదాడకు తీసుకెళ్లి అక్కడ వదిలిపెట్టి ఇంటికి వచ్చాడు.

సోమవారం డ్యూటీకి వెళ్లి మధ్యాహ్నం 3 గంటలకు ఇంటికి వచ్చాడు. అన్నం తిన్నతర్వాత…పడుకుంటానని చెప్పి సెంకడ్ ఫ్లోర్ లోని గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని గడియ పెట్టుకుని పడుకున్నాడు. సాయంత్రం తల్లితండ్రులు పిలిచినా పలకలేదు. గాఢ నిద్రలో ఉన్నాడనుకుని వారు మళ్లీ పిలవలేదు.

రాత్రి10 గంటలకు సోదరుడు ప్రభునాయక్ ఇంటికి వచ్చాడు. అభిలాష్‌ను తీసుకు వచ్చేందుకు పైకి వెళ్లాడు. ఎంత పిలిచినా పలకలేదు. దీంతో పక్కంటి వారి సహాయంతో ఇంటి తలుపు పగులగొట్టి చూడగా రక్తం మడుగులో మంచం పక్కన పడి ఉన్నాడు.

కుటుంబ సభ్యులు వెంటనే స్ధానిక పోలీసులకు సమచారం ఇచ్చారు. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు మృతుడు..బ్లేడుతో గొంతు, చేతి మణికట్టు కోసుకున్నట్లు గుర్తించారు. అభిలాష్‌ గొంతుపై మూడుగాట్లు, ఎడమ చేతి మణికట్టుపై రెండు గాట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అభిలాష్‌ నాయక్‌ తన మిత్రుడి లోన్‌ కోసం ష్యూరిటీ సంతకం పెట్టాడు. మిత్రుడులోన్ కట్టని కారణంగా సదరు రుణం ఇచ్చిన సంస్ధ అభిలాష్ జీతంలోంచి వసూలు చేసుకుంటోంది. అభిలాష్ చేతికి జీతం రావడం లేదు.

ఈ విషయం తల్లిదండ్రులకు తెలియకుండా గోప్యంగా ఉంచుతున్నాడు. దీంతో మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకొని ఉంటాడని స్థానికులు అంటున్నట్లు పోలీసులు తెలిపారు. అభిలాష్‌ నాయక్‌ తన మిత్రుడి లోన్‌ కోసం ష్యూరిటీ ఇచ్చిన కారణంగా చేతికి జీతం రావడం లేదు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియకుండా గోప్యంగా ఉంచుతున్నాడు. దీంతో మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకొని ఉంటాడని స్థానికులు అంటున్నట్లు పోలీసులు తెలిపారు.